సహారా గ్రూప్ నకు సంబంధించిన వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాల్ని జారీ చేసింది. సెబీకి చెల్లించాల్సిన రూ.14,779 కోట్ల మొత్తాన్ని చెల్లించటానికి వీలుగా సహారాకు చెందిన రూ.39వేల కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఆదేశాల్ని జారీ చేసింది. మహారాష్ట్రలోని ఫుణెలోని అంబే వాలీ ఆస్తిని అటాచ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
సెబీకి సహారా సంస్థ రూ.14,779 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. కోర్టు ఇచ్చిన విధివిధానాల్లో భాగంగా ఈ రోజు సెబికి రూ.600కోట్లను చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లిస్తానని పేర్కొంది. అయితే.. సహారా పేర్కొన్నట్లుగా వాయిదాలకు అనుమతిని ఇస్తే.. చెల్లించాల్సిన మొత్తం 2019 జులై వరకూ పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కోర్టు.. ఆ సంస్థ ఆస్తుల్ని అటాచ్ చేసుకోవాలని పేర్కొంది.
సెబీకి చెల్లించాల్సిన మొత్తాన్ని రాబట్టుకునేందుకు సహారా అటాచ్ చేసిన ఆస్తుల్ని వేలం వేయాలని వెల్లడించింది. అదే సమయంలో సహారా చీఫ్ సుబ్రతోరాయ్ పెరోల్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 20కు వాయిదా వేసింది. పెరోల్ పొగిడించటం సుబ్రతో రాయ్ కు ఉపశమనం కలిగించినా.. ఆస్తుల అటాచ్ మెంట్ నిర్ణయం ఆయన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/