సుప్రీం ఆర్డ‌ర్: మందు..చిందు క‌లిస్తే త‌ప్పేం లేదు

Update: 2019-01-17 10:51 GMT
సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. మ‌హారాష్ట్ర స‌ర్కారుకు ఊహించ‌ని షాకిచ్చింది. మహారాష్ట్రలోని డ్యాన్స్ బార్లకు ఊరట కలిగించే తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. డ్యాన్స్ బార్లపై అక్కడి ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలను కొట్టేసింది. బార్లలో మందు - చిందు కలిసి నడవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని డ్యాన్స్ బార్లు ప్రార్థనాలయాలు - విద్యాసంస్థలకు కనీసం కిలోమీటరు దూరంలో ఉండాలన్న నిబంధనను కూడా కోర్టు తోసిపుచ్చింది. ముంబైలో ఇది కుదరదని - దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. బార్ల‌లో సీసీటీవీలు క‌చ్చితంగా ఉండాల‌న్న ప్ర‌భుత్వ నిబంధ‌న‌ను కూడా కోర్టు కొట్టేయ‌డం గ‌మనార్హం.

అంతేకాదు బార్ రూమ్స్ - డ్యాన్స్ ఫ్లోర్ మధ్య గోడ ఉండాలన్న నిబంధనను కూడా సుప్రీం కొట్టేసింది. ఇక ఈ బార్లలో డ్యాన్స్ చేసే వారికి టిప్స్ ఇవ్వాలి తప్ప.. వాళ్లపై డబ్బు వెదజల్లకూడదని కూడా కోర్టు తేల్చి చెప్పింది. ప్రార్థనాలయాలు - విద్యాసంస్థలకు కిలో మీటర్ దూరంలో బార్లు ఏర్పాటు చేయాలన్న నిబంధనను సవాలు చేస్తూ ఈ బార్ల యజమానులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. పెద్ద పెద్ద నగరాల్లో ఇది కుదరదని వాళ్లు వాదించారు. 2016లో ఈ డ్యాన్స్ బార్లపై కఠిన నిబంధనలు విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చింది. డ్యాన్స్ చేసే ప్రదేశాల్లో మద్యం సరఫరా ఉండకూడదని - బార్లు రాత్రి 11.30 గంటలకల్లా మూసివేయాలన్న నిబంధనలు ఇందులో ఉన్నాయి. నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు కూడా విధించాలని ఈ చట్టంలో చేర్చారు.

 డాన్స్ బార్ రెగ్యులేషన్ చట్టాన్ని 2016లో మహారాష్ట్ర అమలులోకి తెచ్చింది. డాన్స్ జరుగుతున్న ప్రాంతంలో లిక్కర్ సర్వ్ చేయడాన్ని ఈ చట్టం నిషేధించింది.  డాన్స్ బార్లను రాత్రి 11.45 గంటల కల్లా మూసేయాలని నిబంధన పెట్టారు. చట్టంలోని నిబంధనలను పాటించకపోతే డాన్స్ బార్ ఓనర్లు - కస్టమర్లకు భారీ జరిమానాలు విధించాలని అందులో పేర్కొన్నారు. దీనిపై కోర్టుకు వెళ్ల‌డంతో తాజా తీర్పు వెలువ‌డింది.





Tags:    

Similar News