అనూహ్యమైన పరిణామాలతో వార్తల్లో నిలిచే ఢిల్లీ తాజాగా ఓ చిత్రమైన అంశంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే చెత్త తరలింపు విషయంలో గవర్నర్‌పై కోర్టు గరం అవడం. ఢిల్లీలో చెత్త తరలింపు విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనిల్ బైజల్ తీరును సుప్రీంకోర్టు నిలదీసింది. మున్సిపల్ విభాగంపై ఎల్జీకి తగిన అధికారాలు ఉన్నప్పటికీ ఢిల్లీలో చెత్త తరలింపు అంశంలో సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోవడం పట్ల న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని మున్సిపల్ కార్పొరేషన్ లకు బాధ్యుడినంటూ హామీనిస్తూ ఎల్జీ న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. అనంతరం న్యాయమూర్తులు ఎం.బీ. లోకూర్ - దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం చెత్త తరలింపు అంశంలో ఆయనకు చీవాట్లు పెట్టింది.
ఢిల్లీలోని ఓఖ్లా - భల్ స్వా - ఘాజీపూర్ లో గుట్టలుగా పేరుకుపోయిన చెత్తకు ఎవరు బాధ్యులంటూ సర్వోన్నత న్యాయస్థానం ఎల్జీని వివరణ కోరింది. దీంతో మునిసిపల్ విభాగానికి తానే బాధ్యుడినంటూ బదులిస్తూ న్యాయస్థానంలో ఎల్జీ అఫిడవిట్ ను సమర్పించారు. ఢిల్లీలో చెత్త పేరుకుపోవడం కారణంగా ప్రజలు డెంగ్యూ - మలేరియా - చికున్ గున్యా బారిన పడుతున్నారంటూ న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ తీరుపై న్యాయమూర్తులు ఆగ్రహ వ్యాఖ్యలు చేశారు. 'మున్సిపల్ విభాగంపై అధికారాలు నాకే ఉంటాయంటారు. సూపర్ మ్యాన్ అంటుంటారు. కానీ ఈ విషయంలో ఏమీ చేయరు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. చెత్త తరలింపు విషయంలో తగిన గడువును విధించడంపై అడిషనల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ తిరస్కరించిన అనంతరం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వివిధ ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటిలోగా తరలిస్తారో చెప్పాలంటూ న్యాయమూర్తులు ఎల్జీని ప్రశ్నించారు. కాగా.. మునిసిపల్ విభాగానికి బాధ్యుడినంటూ ఎల్జీ స్పష్టం చేయడంతో ఈ విషయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను లాగవద్దని స్పష్టం చేసింది.