వాటిని బ్యాన్ చేయలేమన్న సుప్రీం

Update: 2015-12-05 08:53 GMT
ఇవాల్టి రోజున ఫేస్ బుక్.. వాట్సప్ లాంటి వెబ్ సైట్లు ఎంతగా ప్రాచుర్యం పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియాతో లాభంతో పాటు.. కొంత నష్టం కూడా కలుగుతుందని చెప్పక తప్పదు. చెన్నై భారీ వర్షాల కారణంగా.. సోషల్ మీడియా ప్లే చేసిన రోల్ ఎవరూ మర్చిపోలేరు. వాట్సప్ సాయంతో తమ సమస్యల సమాచారాన్ని బయట ప్రపంచానికి తెలిపిన విషయాన్ని మర్చిపోకూడదు.

ఆపదలో ఉన్నప్పుడు ఎంతో సాయంగా నిలుస్తున్న ఈ సోషల్ మీడియాల్ని బ్యాన్ చేయాలంటూ సుప్రీంకోర్టును అభ్యర్థిస్తూ ఒక పిటీషన్ దాఖలైంది. ఈ సోషల్ వెబ్ సైట్ల తో అసభ్యకరమైన సమాచారంతో పాటు.. అత్యాచారాలకు సంబంధించిన వీడియోలు వ్యాప్తి చేస్తున్నారని.. దీని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ పిటీషనర్ తన వాదనను వినిపించారు.

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. వాట్సప్.. ఫేస్ బుక్ లాంటి సైట్లను బ్యాన్ చేయటం సాధ్యం కాదని తేల్చేసింది. డెస్క్ టాప్ ద్వారా ఇలాంటివి వ్యాప్తి చెందుతుంటే అరికట్టొచ్చని.. కానీ.. మొబైల్ ద్వారా వ్యాప్తిని అడ్డుకోలేమన్న సుప్రీం కోర్టు వీటిని బ్యాన్ చేయటం మాత్రం సాధ్యం కాదంది. అయితే.. ఇలాంటి వెబ్ సైట్ల ద్వారా వ్యాప్తి జరిగే చట్టవిరుద్ధమైన సమాచారంపై నిఘా ఉంచేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. మరి.. కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News