ఎస్టీ -ఎస్టీ చట్టం చాలా సందర్భాల్లో దుర్వినియోగమవుతోందని, నిర్దోషులైన ప్రభుత్వోద్యోగులను - ప్రైవేటు వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేయడానికి - వ్యక్తిగత కక్షలు తీర్చుకోడానికి, స్వప్రయోజనాల కోసం దానిని వాడుకుంటున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ ఈ ఏడాది మార్చి 20న సంచలన తీర్పు వెలువరిచిన సంగతి తెలిసిందే. ఇకపై ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద తక్షణ అరెస్టులను నిషేధిస్తూ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. అయితే, మార్చి 20 న వెలువరించిన తీర్పును వ్యతిరేకిస్తూ దళితసంఘాలు నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకంగా మారడంతో కేంద్రం రంగంలోకి దిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ఉల్లంఘించేలా తీర్పు ఉందని కేంద్రం ఆక్షేపించింది. ఆ తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఆ ఉత్తర్వులపై పునరాలోచించాలని సుప్రీంను కేంద్రం కోరింది. తాజాగా, ఆ పిటిషన్ ను గురువారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పై గురువారం నాడు సుప్రీం కోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు తాము 100 శాతం కట్టుబడి ఉన్నామని కేంద్రానికి సుప్రీం తెలిపింది. దళితులపై వేధింపులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధిస్తామని, సుప్రీం తెలిపింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించాలన్న కేంద్రం వాదనను సుప్రీం తోసిపుచ్చింది. ఆ రివ్యూ పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలన్న సుప్రీం కోర్టును కేంద్రం కోరింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ఎస్సీ - ఎస్టీ వేధింపుల చట్ట సవరణ కేసును నిర్థారించే న్యాయమూర్తుల కులాలకు సంబంధించి న్యాయవాది ఇందిరా జైసింగ్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను కేంద్రం తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దాని పై స్పందించిన సుప్రీం...ఆ అంశం ముగిసిపోయిందని (క్లోజ్ డ్) వ్యాఖ్యానించింది. ఈ నెల 16న జరగబోతోన్న విచారణపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.