క‌ర్ణ‌న్‌ కు ఇంకో షాకిచ్చిన సుప్రీంకోర్టు

Update: 2017-06-21 08:15 GMT
సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల‌పై వారెంట్ జారీ చేయ‌డం ద్వారా వార్త‌ల్లోకి ఎక్కిన వివాదాస్ప‌ద జ‌డ్జీ క‌ర్ణ‌న్‌ కు అదే స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం కేంద్రంగా గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. కోర్టు దిక్కార కేసును ఎదుర్కుంటూ గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న జస్టిస్ క‌ర్ణ‌న్‌ ను నిన్న‌ తమిళనాడులోని కోయంబత్తూరులో పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే త‌న‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వాల‌ని జ‌స్టిస్ క‌ర్ణ‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సంద‌ర్భంగా క‌ర్ణ‌న్ తీరును తీవ్రంగా త‌ప్పుప‌ట్టింది.

దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆదేశాల‌ను దిక్క‌రించ‌డం, విదేశాల‌కు పారిపోయేందుకు ప్ర‌య‌త్నించ‌డం వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డటం ద్వారా క‌ర్ణ‌న్ త‌న అప‌న‌మ్మ‌కాన్ని చాటుకున్నార‌ని పేర్కొంది. అలా వ్య‌వ‌హ‌రించిన స‌మ‌యంలో తిరిగి న్యాయ‌స్థానాన్ని ఎలా బెయిల్ కోరుతున్నార‌ని వ్యాఖ్యానించింది. అలాంటి వ్య‌క్తిపై ఎలా ద‌య చూపాల‌ని ప్ర‌శ్నించింది. కాగా బెయిల్ నిరాక‌ర‌ణ‌కు గురికావ‌డంతో క‌ర్ణ‌న్ జైలుకు వెళ్ల‌డం త‌ప్ప‌నిస‌రి. ఆయ‌న్ను కోల్‌ కతాలోని ప్రెసిడెన్సీ జైలుకు తరలించ‌నున్న‌ట్లు సమాచారం. కాగా ఇప్ప‌టివ‌ర‌కు కోర్టు దిక్కారం కేసు ఎదుర‌వ‌గా ఇప్పుడు దేశం విడిచి వెళ్లిన కేసును ఎదుర్కోనున్నారు.

కాగా, జ‌స్టిస్ క‌ర్ణ‌న్ ప‌ద‌వీకాలంలో ఉన్న‌ స‌మ‌యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ సహా ఏడుగురు న్యాయమూర్తుల విదేశీ ప్రయాణాలపై నిషేధాజ్ఞలు జారీచేశారు. తన కేసు విచారణ పూర్తయ్యే వరకు సుప్రీం న్యాయమూర్తులను విదేశీ యానానికి అనుమతించవద్దని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ను ఆదేశించారు. దళితుడిగా తన హక్కులను కాలరాస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జాతీయ స్థాయి నేరస్థులని జస్టిస్ కర్ణన్ ఆరోపిస్తూ సీజేఐ తదితరుల విదేశీ యానంపై ఏప్రిల్ 13న తొలిసారి నిషేధాజ్ఞలు జారీచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విదేశాలకు వెళ్లి కుల వివక్ష వైరస్ వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తారని కర్ణన్ ఆరోపించారు. సుప్రీంకోర్టు జ‌డ్జీల విష‌యంలో క‌ర్ణ‌న్ త‌న దూకుడు వ్య‌వ‌హార‌శైలితో ముందుకు సాగ‌డం న్యాయవ్య‌వ‌స్థ‌లో క‌ల‌క‌లం రేకెత్తించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News