హే...వాట్సాప్ పై నిషేధం లేదట‌

Update: 2016-06-29 10:12 GMT
వాట్సాప్ మెసెంజ‌ర్‌ ను నిషేధించాల‌ని దాఖ‌లైన పిటిష‌న్‌ ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. వాట్సాప్‌ ను బ్యాన్ చేయ‌లేమ‌ని సుప్రీం త‌న తీర్పులో పేర్కొంది. ఈ అంశంపై కేంద్ర ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించాల‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. వాట్సాప్ నిషేధ అంశాన్ని టెలికామ్ ఫిర్యాదుల ట్రిబ్యున‌ల్‌ కు తీసుకెళ్లాల‌ని పిటిష‌న్‌ దారుకు సుప్రీం కోర్టు సూచించింది.

హార్యానాకు చెందిన సామాజిక కార్యకర్త సుదీర్ యాదవ్ వాట్సప్ - వైబర్ లపై నిషేధం విధించాలని సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ సామాజిక సందేశాల అప్లికేషన్లు దేశ భద్రతకు చేటు అని ఆయన తన పిటీషన్లో తెలిపారు. వాట్సాప్ అప్లికేషన్లు సందేశాలను ఎన్క్రిప్షన్ చేసి పంపుతున్నాయని వీటితో ఉగ్రవాదులు చేరవేసే సమాచారాన్ని దర్యాప్తు అధికారులు చేధించడం అసాధ్యమని ఆరోపించారు. సూపర్ కంప్యూటర్ల సాయంతో ఒక్క 256-బిట్ సందేశాన్ని డీక్రిప్షన్ చేయాలంటే వందల సంవత్సరాలు పడుతుందని సుదీర్ వివరించాడు. సందేశాలను ఎన్ క్రిప్షన్ చేస్తున్న వాట్సప్ - వైబర్ - టెలిగ్రామ్ - హైక్ - సిగ్నల్ అప్లికేషన్లను వెంటనే నిషేధించాలని పిటిషన్ లో పేర్కొన్నాడు.  ఈ పిటిష‌న్‌ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఈ మేర‌కు తీర్పిచ్చింది.
Tags:    

Similar News