అప్పుడెప్పుడో కేసీఆర్ ఫిలింసిటీ పర్యటన తరువాత కొద్దినెలల కిందట వరకు రామోజీ - కేసీఆర్ ల దోస్తీ బ్రహ్మాండంగా సాగింది. కానీ, కొద్దికాలంగా ఇద్దరి మధ్యా ఎడం పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వచ్చేసరికి అది ముదిరిపోయింది. రాష్ట్రాలుగా విడిపోయినా రాజకీయంగా కలిసే ఉంటాం అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తుండడం.. అది కూడా కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తుండడంతో రాజకీయాలతో పాటు వ్యక్తిగత సంబంధాల సమీకరణలు కూడా మారిపోయాయి. ఆ ఫలితంగానే కేసీఆర్ - రామోజీల మధ్య మళ్లీ బెడిసికొట్టింది. తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం పోటీ చేస్తుండడంతో రామోజీ మీడియా స్టాండ్ కేసీఆర్‌కు వ్యతిరేకంగా మారిపోయింది. దీంతో కేసీఆర్ కు మంటపుట్టడం సహజమే... ఫిలింసిటీ ఆక్రమణలకు క్లీన్ చిట్ ఇవ్వడం.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు అందించడం వంటి ఎన్ని పనులు చేసినా తీరా ఎన్నికలు వచ్చే నాటికి రామోజీ చెయ్యివ్వడాన్ని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారట... అయితే, ఇప్పుడు కేసీఆర్ చేతికి కూడా రామోజీ పిలక దొరికిందని చెబుతున్నారు.. సుప్రీం కోర్టు ఆదేశం పుణ్యమా అని రామోజీని ఆటాడుకోవడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
రామోజీ అనగా ఆయన మీడియా సామ్రాజ్యం గుర్తొచ్చినట్లే ఆయన మార్గదర్శి చిట్స్ కూడా గుర్తొస్తాయి. అంతేనా.. మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం కూడా గుర్తు తెచ్చుకోండి. వైఎస్ టైంలో ఈ కారణంగా రామోజీ ఎంతగా ఇరకాటంలో పడ్డారో గుర్తుంది కదా. ఇప్పుడు మరోసారి ఆయన్ను ఆటాడించడానికి ఈసారి కేసీఆర్ రెడీ అవుతున్నారట. ఇందుకు కారణం మార్గదర్శి కేసు మరోసారి కదలడమే.
రామోజీరావుకు చెందిన మార్గదర్శి సంస్థ నిబంధనలకు విరుద్దంగా భారీగా డిపాజిట్లు సేకరించినట్టు ఆరోపణలున్నాయి.. ఈ కుంభకోణాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పట్లో వెలుగులోకి తెచ్చారు. కుంభకోణంపై విచారణ జరపాలని కోరగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోసం జీవో కూడా జారీ చేసింది. అయితే వెంటనే రామోజీరావు హైకోర్టు ఆ తర్వాత, సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అప్పటి నుంచి కేసు స్టేలో ఉంది. కానీ, ఇప్పుడు ముఖ్యమైన కేసులు ఏవైనా ఉంటే ఆరు నెలలకు మించి స్టే పొడిగించకూడదన్న సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ఇప్పుడు మార్గదర్శి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. స్టేను మరింత కాలం పొడిగించాలని రామోజీరావు కోరినా సుప్రీం కోర్టు అందుకు అంగీకరించలేదు. మార్గదర్శి వ్యవహారంపై స్పందన తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వానికి, ఉండవల్లి అరుణ్ కుమార్‌కి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సుప్రీం ఇన్వాల్వ్ చేయడంతో కేసీఆర్ ఈ అవకాశాన్ని వాడుకుని రామోజీని దారిలో పెట్టాలని ట్రై చేస్తున్నారట. మార్గదర్శిపై కేసీఆర్ ఆపద్ధర్మ ప్రభుత్వం విరుచుకుపడేందుకు రెడీ అవుతున్నట్లు టాక్.