నిమ్మగడ్డ వ్యవహారం: ఇక తాడోపేడో.?

Update: 2020-06-07 09:38 GMT
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరింది. ఆయనను వైఎస్ జగన్ ప్రభుత్వం తొలగించడం.. దీనిపై హైకోర్టు చెల్లదనడంతో ఈ ఎపిసోడ్ లో ట్విస్ట్ నెలకొంది. అయితే హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈనెల 10న ఈ పిటీషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టబోతోంది. దీంతో ఈ నిమ్మగడ్డ వ్యవహారం క్లైమాక్స్ కు చేరినట్టైంది.

ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేసింది. ఈనెల 10న ఈ లీవ్ పిటీషన్ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డే సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించబోతోంది.

ఏపీ ప్రభుత్వం తరుఫున అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలు వినిపిస్తారు. ఇక ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే నిమ్మగడ్డకు మద్దతుగా బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ - కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ - టీడీపీ నేత వర్ల రామయ్య సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వీటన్నింటిని సుప్రీంకోర్టు ఈనెల 10న విచారించనుంది. బీజేపీ - టీడీపీ - కాంగ్రెస్ ఒక్కటై నిమ్మగడ్డకు సపోర్టుగా సుప్రీం కోర్టులో నిలబడడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భవితవ్యం విషయంలో సుప్రీం కోర్టు ఎలాంటి ఆదేశాలను ఇస్తుందనేది ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.


Tags:    

Similar News