ప్రస్తుతం దేశవ్యాప్తంగా మనిషికి ప్రాణం ఉన్నా లేకపోయినా.. ముఖ్యంగా ఉండాల్సింది.. ఆధార్!! ఇది నిజం. మొన్నామధ్య హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆధార్ లేనిదే... మరణ ధృవీకరణ పత్రం ఇవ్వలేమని స్పష్టం చేసేసింది. ఇంతలా మనకు తెలియకుండానే మనతో పెనవేసుకుపోయిన ఆధార్ కార్డుపై అనేక కేసులు దేశవ్యాప్తంగా ఫైలయ్యాయి. దీనిలో ఇచ్చే అనేక విషయాలు మన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తాయని, ముఖ్యంగా మన వ్యక్తిగత స్వేచ్ఛ జీవించే హక్కు అయిన ఆర్టికల్ 21ని ఈ విధానం తోసిపుచ్చుతుందని సామాజిక ఉద్యమకారులు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు.
అయినా కూడా ప్రభుత్వాలు ఈ మొత్తుకోళ్లను పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టులో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందని పేర్కొంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని ఇప్పటికే విచారించిన సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని.. వ్యక్తిగత గోప్యత జీవించే హక్కులో ముఖ్యంగా ప్రాధమిక హక్కులో భాగమా ? కాదా? అని ప్రశ్నించింది కూడా. దీనికి ప్రభుత్వం కాదని చెప్పేసింది. దీనిని పరిశీలించిన సుప్రీం కోర్టు.. కేంద్రానికి చెంప పెట్టులాంటి తీర్పు చెప్పింది... గురువారం సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనంటూ తీర్పు చెప్పింది.
రెండు రోజుల కిందట ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుంచి ఉపశమనం కలిగిస్తూ.. దశాబ్దాలుగా వారు అనుభవిస్తున్న కష్టాలకు చెక్ పెట్టిన సుప్రీంకోర్టు.. గురువారం దేశంలోని 120 కోట్ల మందికి ఉపశమనం కలిగిస్తూ.. ఇచ్చిన తీర్పు కూడా సంచలనంగా మారింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గోపత్య ప్రాథమిక హక్కేనంటూ ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. వ్యక్తిగత గోప్యత కూడా రాజ్యంగంలోని ఆర్టికల్ 21(జీవించే హక్కు) కిందకు వస్తుందని చెప్పింది.