ఓటు నోటు కేసులో సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు

Update: 2021-05-28 09:30 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తాజాగా దేశ అత్యున్న‌త న్యాయ స్థానం సుప్రీం కోర్టు.. సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ కేసులో విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు సాక్షుల క్రాస్ ఎగ్జామినేష‌న్ నిర్వ‌హించ‌రాద‌ని పేర్కొంది. దీంతో ప్ర‌స్తుతం ఈ కేసులో క్రాస్ ఎగ్జామినేష‌న్ ఎదుర్కొంటున్న ఎంపీ రేవంత్‌రెడ్డికి ఒకింత ఊర‌ట ల‌భించిన‌ట్ట‌యింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


తాజాగా కేసును విచారించిన సుప్రీం కోర్టు తెలంగాణ ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. దీనికి నాలుగు వారా ల్లో స‌మాధానం చెప్పాల‌ని న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ వీఆర్ గ‌వాయ్‌, జ‌స్టిస్‌ సూర్య‌కాంతల‌తో కూడిన ధ‌ర్మాస నం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2015, మే 15 నాటి ఓటుకు నోటు కేసులో ఇటీవ‌ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు కు ఊర‌ట ల‌భించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఆయ‌న పేరును తొల‌గిస్తూ.. సుప్రీం కోర్టు ఉత్త‌ర్వులు ఇచ్చింది.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నామినేటెడ్ స‌భ్యుడు స్టీఫెన్ స‌న్ ఓటును కొనుగోలు చేసేందుకు అప్ప‌టి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్ర‌య‌త్నించార‌నేది అభియోగం. దీనిపై సాగుతున్న విచార‌ణ క్ర‌మంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు పేరు కూడా ఉండ‌డంతో అప్ప‌ట్లోనే సంచ‌ల‌నం రేగింది. ఇక‌, ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల క్ర‌మంలో రేవంత్‌రెడ్డి అరెస్టు కావ‌డం.. కొన్ని రోజులు జైల్లో ఉండ‌డం.. త‌ర్వాత బెయిల్ త‌దిత‌ర ప‌రిణామాల త‌ర్వాత‌.. ఈ కేసు విచార‌ణ విష‌యంలో జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టు తాజాగా.. విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు సాక్షుల‌ను క్రాస్ ఎగ్జామిన్ చేయొద్దంటూ.. సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News