ప్రకృతి అందాలకు నెలవైన అరకలోయను చూసేందుకు వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ దంపతులు.. గిరిజన సంప్రదాయంతో మళ్లీ పెళ్లి చేసుకున్న వైనం ఆసక్తికరంగా మారింది. అంగరంగ వైభవంగా సాగిన ఈ పెళ్లి వేడుక రోటీన్ కు భిన్నంగా సాగిందని చెప్పాలి. ఆసక్తికరంగా మారినఈ వివాహ వేడుక వివరాల్లోకి వెళితే..
అరకలోయను సందర్శించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ యూ లలిత్ దంపతులు వచ్చారు. విశాఖపట్నం నుంచి కిరండూల్ ప్యాసింజర్ ట్రైన్ లో వచ్చిన సుప్రీం జడ్జి దంపతులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.. హైకోర్టు న్యాయమూర్తి అమానుల్లాఖాన్ లు అరకు రైల్వే స్టేషన్ లో స్వాగతం పలికారు. వీరితో పాటు అల్లూరి సీతారామ రాజు జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్.. పాడేరు ఐటీడీఏ పీవో గోపాల క్రిష్ణతో పాటు పలువురు అధికారులు వచ్చారు.
ఇక్కడ గిరిజన సంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు నిర్వహించి గిరి గ్రామదర్శినిని సందర్శించారు. గిరిజన సంప్రదాయంతో జరిగే పెళ్లి గురించి తెలుసుకున్న వారు.. తాముకూడా ఆ రీతిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
దీంతో అప్పటికప్పుడు ఏర్పాట్లు జరిగిపోయాయి. జస్టిస్ లలిత్ దంపతులు కాస్తా పెళ్లి కొడుకు.. పెళ్లి కుమార్తెగా మారిపోయారు. పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు వీరి పెళ్లికి పెద్దగా మారారు.
గిరిజన సంప్రదాయానికి తగ్గట్లుగా వారి పెళ్లి దుస్తుల్ని ధరించిన వారు.. పీటల మీదకు కూర్చున్నారు. గిరిజన పూజారులు జడ్జి దంపతుల్ని గిరిజన ఆచారం ప్రకారం వైభవంగా పెళ్లి నిర్వహించారు.
న్యాయమూర్తి మరోసారి తన శ్రీమతికి తాళి కట్టారు. దండలు మార్చుకున్నారు. ఈ పెళ్లి వేడుక సందర్భంగా అంత పెద్ద స్థానంలో ఉన్న సుప్రీం జడ్జి లలిత్ సైతం పెళ్లి కొడుకు మాదిరే సిగ్గుపడటం చూపురులను కట్టి పడేసింది. గిరిజన సంప్రదాయంలో చేసుకున్న వారి పెళ్లి ఆకట్టుకోవటమే కాదు.. అందరిని ఆకర్షించింది.