ఆంధ్రప్రదేశ్ - ప్రత్యేక హోదా.. ప్రస్తుతం ఈ అంశం ఏపీని దాటి జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యేక హోదా గొప్పతనాన్ని - అది ఉండటం వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను - అది లేకపోవడం వల్ల కలిగే నష్టాన్ని ఎన్నికల సందర్భంగా చేసే ఊకదంపుడు ఉపన్యాశాల్లో చెప్పిన వారే.. ఎన్నికల అనంతరం గెలిచి కుర్చీలు ఎక్కిన తర్వాత.. ప్రత్యేక హోదావల్ల కలిగే ప్రయోజనాలు ఏమీ లేవు, కావాలంటే ఇప్పటికే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు వెళ్లి చూడండి అని నిస్సుగ్గు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విషయాలపై టీడీపీ - బీజేపీలను ప్రతిపక్షాలు - మేధావులు - ప్రజలూ విమర్శలు చేస్తున్నారు. ఇది ఆ రెండుపార్టీల నయవంచనగా భావిస్తున్నారు.
ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పై సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి స్పందించారు. ఏపీకి ఇపుడు ప్రత్యేక హోదా ఇవ్వలేము అని చెప్పడం కచ్చితంగా నయవంచనే అని స్పష్టం చేసిన సుధాకర్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం బీజేపీకి ఏమత్రం ఇష్టంలేదని - అలా అని ఇవ్వబోము అని చెప్పే ధైర్యం కూడా ఆ పార్టీకి లేదని తేల్చి చెప్పేశారు. అలాగే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి అని అడిగే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబు కు లేదని ఆయన విమర్శించారు.