ఆయన బీహారీ బాబు. రాజకీయ చతురత కలిగిన నాయకుడు. అందుకే 2005 తరువాత బీహార్ కి ఆయనే సీఎం. మరొకరికి చాన్సే ఇవ్వడంలేదు. ఈ మధ్యలో ఎన్ని పార్టీ కూటములు కట్టాయో ఎన్ని పార్టీలు చీలిపోయాయో లెక్కా జమా లేదు. కానీ సీఎం సీటు మాత్రం ఆయనదే. ఆయన పక్కన డిప్యూటీ సీఎం లు మారుతున్నారు. మంత్రులు కూడా మారుతున్నారు.
కానీ చుక్కల్లో చంద్రుడిగా ఆయన మాత్రం అలా బాగా వెలిగిపోతున్నారు. దటీజ్ నితీష్ కుమార్ అని అనిపించుకున్నారు. ఇదిలా ఉండగా ఒకనాడు ఆయనతో దోస్తీ చేసి జేడీయూలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇపుడు అదే నితీష్ మీద కారాలు మిరియాలూ నూరుతున్నారు. అయితే ఆయన విమర్శలు చేయడం తగ్గించి సెటైర్లు వేస్తున్నారు.
బీహార్ సీఎం నితీష్ కుర్చీకి భలే అతుక్కుపోతారని పీకే సెటైర్లు వేస్తున్నారు. కూటమి ఏది అవనీ కానీ సీఎం కుర్చీ మాత్రం ఆయనదే అంటున్నారు. ఈ విషయంలో ఆయన్ని మెచ్చుకోవాల్సిందే అని కూడా వ్యంగ్యంగా అంటున్నారు. ఆయన ఉన్న మహా కూటమిలోని వారు కూడా ఇక మీద కలసి ఉండలేరని బాంబు పేల్చారు. అంతా నితీష్ చుట్టూ తిరిగినా ఆశ్చర్యం లేదని అన్నారు.
ఇదిలా ఉండగా ఇన్ని మాటలు అన్న పీకే నితీష్ కుమార్ ని ఆయన నివాసంలో కలసి చర్చలు జరపడం విశేషం. ఆ చర్చలు సంగతి ఏమైందో కానీ బయటకు వచ్చి మీడియాతో మాత్రం నితీష్ మీద సెటైర్లు వేయడానికే పీకే తన టైం అంతా ఉపయోగించారు. నితీష్ ని ఫెవికాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని తాను కోరుతున్నానని అన్నరు. ఒక వేళ ఆ కంపెనీ వారు ఎవరైనా తన దగ్గరకు వస్తే ఆయన పేరుని సూచిస్తాను అని కూడా అన్నారు.
ఇక నితీష్ ఆడుతున్న ఈ కుర్చీలాట ఫెవికాల్ పాలిటిక్స్ జాతీయ స్థాయిలో ఏ మత్రం ప్రభావం చూపించవని పీకే ధీమాగా చెబుతున్నారు. జాతీయ రాజకీయాలు వేరు. బీహార్ పాలిటిక్స్ వేరు అని కూడా ఆయన అంటున్నారు. ఇక నితీష్ తో తాను జరిపిన సమావేశం ప్రత్యేకమైనది అని అది బీహార్ పాలిటిక్స్ కే పరిమితం అని పీకే చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా మిషన్ 2024 పేరిట కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న నితీష్ కుమార్ గాలి తీసేలా పీకే సెటైర్లు వేస్తున్నారు.
మరి నితీష్ మీద పీకే చేస్తున్న ఈ ఫెవికాల్ బ్రాండ్ అంబాసిడర్ కామెంట్స్ కనుక జాతీయ స్థాయిలో ఇతర పార్టీల అధినేతలు కనుక సీరియస్ గా తీసుకుంటే పీఎం పోస్ట్ ఆయనకు అప్పచెబుతారా అన్నదే డౌట్. ఒకవేళ అప్పచెబితే అక్కడ కూడా ఆయన ఫెవికాల్ వేసుకుని కుర్చీకి అతుక్కుపోతే పీఎం పోస్టు మీద కన్నేసిన మిగిలిన వారి సంగతేంటో. మొత్తానికి పీకే నితీష్ ని పొగుడుతున్నారా విమర్శిస్తున్నారా. ఏమో నితీష్ ఆయన్ని పిలిచి మరీ సమావేశం అయ్యారు అంటే బీహారీ బాబుకు అవి విమర్శలుగా కనిపించడంలేదన్న మాటేగా.