తొలి అనుభ‌వానికి తొంద‌రెక్కువ అవుతోంద‌ట‌!

Update: 2018-05-28 23:30 GMT
తొలిసారి సెక్స్ ఏ వ‌య‌సులో చేస్తున్నారు?  ఎర్లీ వ‌య‌సులో పురుషులు తొలి అనుభ‌వాన్ని ఎక్కువ‌గా పొందుతున్నారా?  స్త్రీలు ఎక్కువా?   తొలి అనుభ‌వం విష‌యంలో నార్త్ వారు జోరుగా ఉంటారా?. సౌత్ వారు జోరుగా ఉంటారా?  ఇంత‌కీ తొలి అనుభ‌వం ఏ వ‌య‌సులో ఉంద‌న్న విష‌యంపై తాజాగా జాతీయకుటుంబ‌ ఆరోగ్య స‌ర్వే ఆస‌క్తిక‌ర గ‌ణాంకాల్ని వెల్ల‌డించింది.

దాదాపు రెండు ల‌క్ష మందితో నిర్వ‌హించిన శాంపిల్స్ ఆధారంగా   దేశీయంగా లైంగిక జీవితానికి సంబంధించిన ప‌లు అంశాల్ని వెల్ల‌డించారు. ఈ స‌ర్వేలో ల‌క్ష మంది పురుషులు.. ల‌క్ష మంది మ‌హిళ‌లు పాల్గొన్నారు. తొలిసారి సెక్స్ చేసే విష‌యంలో ప్రాంతాల వారీగా.. వారి ఆర్థిక ప‌రిస్థితులు.. కెరీర్ ఇలాంటివెన్నో అంశాలు ముడిప‌డి ఉన్నాయ‌న్న వైనం తాజాగా జ‌రిపిన అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది.

స‌ర్వేలో వెల్ల‌డైన అంశాల్లో ముఖ్య‌మైన‌వి చూస్తే..

+  పురుషుల‌తో పోలిస్తే మ‌హిళ‌లే చాలా త్వ‌ర‌గా తొలి అనుభ‌వాన్ని పొందుతున్న‌ట్లుగా తేలింది. దేశంలో యువ‌తుల్లో తొలి లైంగిక అనుభ‌వం 15 నుంచి 19 సంవ‌త్స‌రాల లోపే ఉంటుంద‌ని తేలింది. అదే స‌మ‌యంలో పురుషుల విష‌యానికి వ‌స్తే ఇది 20-24 ఏళ్ల మ‌ధ్య ఉన్న‌ట్లుగా తేలింది

+ సౌత్ తో పోలిస్తే నార్త్ ప్రాంతం వారు లైంగిక జీవితంలో చురుగ్గా ఉంటున్న‌ట్లు తేలింది

+ తొలి అనుభ‌వంలో పురుషుల కంటే స్త్రీలు ముందుగా ఉండ‌టానికి కార‌ణం వారు పెళ్లి చేసుకునే వ‌య‌సు కార‌ణం వ‌ల్లేన‌ని చెబుతున్నారు. అమ్మాయిల‌కు యుక్త వ‌య‌సులోనే ఎక్కువ‌గా పెళ్లిళ్లు చేయ‌టం.. కెరీర్ కోసం పురుషుల‌కు ఆల‌స్యంగా పెళ్లి కావ‌టంతో తొలి అనుభ‌వం పురుషుల కంటే మ‌హిళ‌లే త్వ‌ర‌గా పొందుతున్నారు.

+ పెళ్లికి ముందు సెక్స్ అన్న‌ది దేశంలో చాలా ప్రాంతంలో త‌ప్పుగా భావిస్తున్నారు. 15-24 వ‌య‌సులో ఉన్న ఒంట‌రి పురుషుల్లో 11 శాతం మంది.. 2 శాతం మంది మ‌హిళ‌లు మాత్ర‌మే పెళ్లికి ముందు సెక్స్ చేసిన‌ట్లుగా చెప్పుకున్నారు.

+ పెళ్లికి ముందు సెక్స్ చేసిన వారిలో అత్య‌ధికంగా చ‌త్తీస్ గ‌ఢ్ లో 21.1శాతం మంది ఉండ‌గా.. త‌ర్వాతి స్థానంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ 20.7 శాతంలో నిలిచింది.

+ హ‌ర్యానా.. పంజాబ్‌.. చ‌త్తీస్ గ‌ఢ్‌.. రాజ‌స్థాన్.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల్లో స‌ర్వేలో పాల్గొన్న వారిలో 55 శాతం మంది తాము చాలా కాలం ముందు నుంచి సెక్స్ లో పాల్గొంటున్న‌ట్లు చెప్పారు. ఇదే మాట‌ను చెప్పిన రాష్ట్రాల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌.. గుజ‌రాత్.. ఉత్త‌రాఖండ్‌.. మ‌హారాష్ట్రలు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

+ హ‌ర్యానా.. పంజాబ్‌.. చ‌త్తీస్ గ‌ఢ్‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ల‌లోని ఒంట‌రి పురుషుల్లో క‌నీసం 5 శాతం మంది తాము సెక్స్ చేసిన‌ట్లు ఒప్పుకుంటే.. ఒంట‌రి మ‌హిళ‌ల్లో క‌ర్ణాట‌క‌లో 2 శాతం మంది.. గుజ‌రా్ లో 1.9శాతం మంది తాము సెక్స్ చేసిన‌ట్లుగా ఒప్పుకున్నారు.

+ దేశంలో 90 శాతం మందికి తొలి అనుభ‌వం 30 ఏళ్ల లోపే ఉంటుంద‌ని చెప్పారు. కేవ‌లం 10 శాతం మందికి మాత్ర‌మే 30 ఏళ్ల త‌ర్వాత పొందుతున్నారు.

+ ఒంట‌రి మ‌హిళ‌లు.. పురుషులు తాము ఎక్కువ‌గా సెక్స్ లో పాల్గొన్న‌ది త‌మ బాయ్ ఫ్రెండ్ తో కానీ గ‌ర్ల్ ప్రెండ్స్ తో కానీ అని చెప్ప‌టం గ‌మ‌నార్హం. 70 శాతం మంది పురుషులు త‌మ గాళ్ ఫ్‌రెండ్ తో శృంగారంలో పాల్గొన్న‌ట్లుగా చెబితే.. దాదాపు 65 శాతం మంది మ‌హిళ‌లు త‌మ బాయ్ ఫ్రెండ్స్ తో సెక్స్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఇక‌.. స‌హ‌జీవ‌నం చేస్తున్న వారితో సెక్స్ చేస్తున్న విష‌యంలో మ‌హిళ‌లు.. పురుషులు ఒకేలా ఉన్నారు. అనుకోకుండా క‌లిసిన వ్య‌క్తితో సెక్స్ చేసే విష‌యంలో పురుషులు ముందు ఉంటే.. మ‌హిళ‌లు వెనుకే ఉన్నారు. ఇక‌.. క‌మ‌ర్షియ‌ల్ సెక్స్ వ‌ర్క‌ర్ల‌తో శృంగారం విష‌యంలో పురుషులు ఎక్కువ‌గా ఉంటే.. మ‌హిళ‌లు త‌క్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News