మన మందు బాబులు తెలివి మీరిపోయార‌ట‌

Update: 2016-09-13 22:30 GMT
భారతీయులు ఇటీవలి కాలంలో తెగ తాగేస్తున్నారట. అయితే, తాగుడు విషయంలో మాత్రం చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారట. లైట్ విస్కీ - క్రాఫ్ట్ బీర్ల సేల్స్ పెరగడమే ఇందుకు పెద్ద ఉదాహరణ అని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. ఇటు తాగాలి అనే ఆశ‌ను చంపుకోకుండా...అటు తాగిన‌ట్లుగా ఇంట్లో వాళ్ల‌కి తెలియకుండా మ‌ధ్య మార్గంగా లైట్ వైన్ వంటి వాటిని ఎంచుకుంటున్న‌ట్లు ఆ స‌ర్వే వివ‌రించింది.

రమ్ - ఓడ్కాలను విడిచిపెట్టి విస్కీ వైపు యువకులు మొగ్గు చూపుతున్నట్టు తాజా స‌ర్వే వివ‌రించింది. 2014-15లో రమ్ - ఓడ్కాల సేల్స్ గణనీయంగా తగ్గిపోగా విస్కీ సేల్స్ మాత్రం పెరిగాయి. మారుతున్న కాలంతో పాటు వారి టేస్ట్‌ లో క్రమంగా మార్పు వస్తోందని సర్వే పేర్కొంది. విస్కీ - బీర్ అమ్మకాలు పెరగడానికి ఇదే కారణమని తెలిపింది. యువకులు ఇటీవల టకీలా అనే మద్యం వైపు చూస్తున్నారని ఈ స‌ర్వే వివ‌రించింది. 2014-15లో వీటి అమ్మకాలు పది శాతం పెరగ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని తెలుస్తోంది. గతంలో యువకులు ఎక్కువగా ఫ్రెండ్స్‌ తో కలిసి విస్కీ - రమ్ మొదలైనవాటిని తీసుకునేవారు. అయితే, తాము తాగినట్టు తెలిస్తే ఇంటి వద్ద తిడతారనే ఉద్దేశంతో ఇటీవల రూట్ మార్చారు. విస్కీ - రమ్ మొదలయినవాటికి బదులు వైన్ - క్రాఫ్ట్‌ బీర్ వంటివి తీసుకుంటున్నారు అని ఇండియన్ వైన్ కంపెనీ ఫ్రాటెల్లీ వైన్స్ డైరెక్టర్ కపిల్ ష్రేఖ పేర్కొన్నారు. ఇక వైన్‌లలో లైట్ వైన్ అమ్మకాలు 2014-15లో 17 శాతం పెరిగాయని పేర్కొంటోంది. ఎంతైనా మ‌న మందు బాబులు తెలివి మీరిపోతున్న‌ట్లుగా స్ప‌ష్టంగా ఈ స‌ర్వే చెప్తోంది.
Tags:    

Similar News