గతంలో ఉత్తరాఖండ్ లో వరదలు ప్రళయం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వరదలకు వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు ఉత్తరాఖండ్ అందరిలో ఆందోళన నింపుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన జోషిమఠ్ వ్యవహారం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. దేవ భూమి, ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ కు వెళ్లేదారిలో ఉన్న జోషిమఠ్ లో భూమి కుంగిపోతున్న సంగతి తెలిసిందే.
భూమి కుంగిపోవడం వల్ల వందలాది ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇందులో కొన్ని ప్రమాదకర స్థాయికి దిగజారడంతో అధికారులు వాటిని కూల్చేస్తున్నారు. ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
జోషిమఠ్ లో ఇష్టానుసారం తవ్వకాలు, ప్రాజెక్టుల నిర్మాణం, ఇందుకు కొండలను పిండి చేయడం, నదీ ప్రవాహ సహజ మార్గాలను అడ్డుకుని దారి మళ్లించడం, పర్యావరణ విధ్వంసమే జోషిమఠ్ లో భూ ప్రకంపనలకు కారణమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో గతంలో ఉత్తరాఖండ్ లో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులపై దివంగత నాయకురాలు సుష్మా స్వరాజ్ లోక్ సభలో చేసిన ఓ ప్రసంగం తాలూకూ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
2013 జూన్‌లో ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ లో భీకర వరదలు సంభవించి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అక్కడ పుణ్యక్షేత్రాలను చూడటానికి వెళ్లిన తెలుగు రాష్ట్రాల భక్తులతోపాటు పలు రాష్ట్రాల భక్తులు కూడా ఆ వరదల్లో మృత్యువాత పడ్డారు.
2014 లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన ఈ ప్రకృతి విలయం అప్పట్లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
ఈ నేపథ్యంలో 2013లో కేంద్రంలో బీజేపీ ప్రతిపక్ష హోదాలో ఉంది. దీంతో ఆ పార్టీ ఆ ఏడాది సెప్టెంబరులో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఉత్తరాఖండ్ వరదలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.
ఆ సమయంలో బీజేపీ తరఫున మంచి వాగ్దాటి ఉన్న నాయకురాలుగా ఉన్న సుష్మా స్వరాజ్... ''ఉత్తరాఖండ్‌లో అభివృద్ధి పేరుతో ప్రకృతిని, పర్యావరణాన్ని దారుణంగా నాశనం చేశారు. దాని ఫలితమే కేదార్‌నాథ్ వరదలు. మనం ఎవరి కోసం అభివృద్ధి చేస్తున్నాం ? ఎవరి కోసం మిలియన్–బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాం? వీటి కారణంగా ఏదో ఒక రోజు ప్రకృతి ఉగ్రరూపం దాల్చి.. ప్రతిదాన్నీ నాశనం చేస్తుంది. ఈ విలయం తర్వాత కూడా మనం కళ్లు తెరవకపోతే.. ఇంకెప్పుడు గ్రహిస్తాం?'' అని అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని నిలదీశారు. నాడు సుష్మా స్వరాజ్ ప్రసంగించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.