బాబుకు షాక్: ఏపీ అసెంబ్లీలో తొలి సస్సెన్షన్..

Update: 2019-07-23 05:39 GMT
ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్ వేటు పడింది. జగన్ ప్రభుత్వం కొలువుదీరాక బడ్జెట్ సమావేశాల్లో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేసి జగన్ సంచలనాలకు నాంది పలికారు. మంగళవారం ఏపీ అసెంబ్లీ సమావేశం కాగానే టీడీపీ హామీలు ఇచ్చి మోసం చేసిందని జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన వీడియోలు చూపి చంద్రబాబును కడిగేశారు. దీనిపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు- బుచ్చయ్య చౌదరి- నిమ్మలలు ఆందోళన చేశారు. జగన్ మాట్లాడిన మాటలు కూడా తాము వీడియోలు ఇస్తాం అసెంబ్లీలో ప్రసారం చేయాలంటూ సభలో ఆందోళన చేశారు. ఎంతకు తగ్గకపోవడంతో ఆర్థిక మంత్రి బుగ్గన ఈ ముగ్గురు ఎమ్మెల్యేల సస్సెన్షన్ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.

దీంతో డిప్యూటీ స్పీకర్ మూజువాణి ఓటుతో టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్న- బుచ్చయ్య- నిమ్మల సస్పెన్షన్ తీర్మానాన్ని ఆమోదించింది.దీంతో వారు ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వారకు సభకు హాజరుకాకుండా సస్పెన్షన్ వేటు పడింది.

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుకు తోడుగా వైసీపీతో ఢీ అంటే ఢీ అంటోంది అచ్చెన్నా- బుచ్చయ్య- నిమ్మలలే. ఈ ముగ్గురు  జగన్ , మంత్రులకు ధీటుగా సమాధానమిస్తూ అధికార పక్షాన్ని కలవరపెడుతున్నారు. ఇప్పుడు వీరి సస్పెన్షన్ తో చంద్రబాబు ఒంటరి అయిపోయారు. మున్ముందు చంద్రబాబు ఒంటరిగా జగన్ అండ్ కోను ఎలా ఎదుర్కొంటాడన్నది ఆసక్తిగా మారింది.  

    

Tags:    

Similar News