కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రి వర్గ ప్రక్షాళన ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. మంత్రివర్గంలో స్థానం దక్కని ఎమ్మెల్యేలు - ఆగ్రహంతో ఉన్న మాజీ మంత్రులు త్వరలోనే సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపైన, కాంగ్రెస్ అధిష్టానంపైన తమ నిరసనను ఏ విధంగా తెలపాలనే విషయమై ఆలోచించనున్నారని సమాచారం. ఈ అసంతృప్త భేటీకి ఇటీవలే పదవి కోల్పోయిన ఐదుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఆశావహ ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా గృహ నిర్మాణ శాఖ మంత్రి - రెబల్ స్టార్ అంబరీష్ ఎట్టకేలకు తన మౌనాన్ని వీడారు. స్పీకర్ తో వ్యక్తిగతంగా మాట్లాడి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. వాడుకున్నంత కాలం వాడుకుని విసిరి పారేసే చెప్పులాంటి వాడిని కాదని వ్యాఖ్యానిస్తూ సిద్ధరామయ్యపై అంబరీష్ మండిపడిన సంగతి తెలిసిందే. ఆయనను హిట్లర్ గా కూడా అంబరీష్ అభివర్ణించారు. అంబరీష్ వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించిన సిద్ధరామయ్య ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడతానని చెప్పారు.