ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యేల తీరు ఇప్పుడ ఆసక్తికరంగా మారుతోంది. చదువు పట్ల వారికున్న అవగాహన ఇప్పుడు విస్తు పోయేలా చేస్తోంది. మొన్నటికి మొన్న బీకాంలో ఫిజిక్స్ చదివినట్లుగా చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నోటిమాట చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్ పుడు అంతకు మించినట్లుగా ఉంది పరిస్థితి. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎడ్యుకేషన్ గురించి వచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పి మరీ బుక్ అయిన తీరు ఇప్పుడు ప్రోమోల్లో స్పష్టంగా కనిపించి.. ఈ ఇంటర్వ్యూ మీద ఆసక్తిని మరింత పెంచేలా చేస్తోంది.
బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ బోలెడంత కామెడీని పంచేసిన జలీల్ ఖాన్ వారసుడిగా.. కర్నూలు టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పిన డిగ్రీలో సీఈసీ చదివేశానన్న మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జలీల్ ఖాన్ మాటకు తీసిపోనట్లుగా చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు అందరి నోట నానటం షురూ అయ్యింది.
ఓ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇంటర్లో ఏకోర్సు చేశారన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన ఎస్వీ మోహన్ రెడ్డి.. ఇంటర్ లో మామూలుగా సివిక్స్.. సివిల్.. మామూలుగా జనరల్ ఇప్పుడు ఎంపీటీసీలు.. ఎంపీసీలు ఇవన్నీ లేవు. జనరల్ గా ఉండేది ఇంటర్మీడియట్ అని చెప్పిన ఆయన.. ఇంటర్ లో సీఈసీ లేదన్నారు.
డిగ్రీకి వచ్చిన తర్వాత సీఈసీ చేశానని చెప్పుకొచ్చారు ఎస్వీ మోహన్ రెడ్డి. దీంతో ఇంటర్వ్ తుయూ చేసిన వ్యక్తి డిగ్రీలో సీఈసీ ఉండదని చెప్పటంతో.. ఎస్వీ మోహన్ రెడ్డి తనకు పట్టిన చెమటల్ని టవల్ తో తుడుచుకున్నట్లుగా ఉన్న ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూస్తుంటే.. ఏపీ అధికారపక్షంలో జలీల్ ఖాన్ లాంటోళ్లు.. చాలామందే ఉన్నట్లుగా ఎస్వీ మోహన్ రెడ్డి మాట మరోసారి స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/