చైనాను అణు క్షిపణితో కెలికిన తైవాన్

Update: 2016-07-01 11:28 GMT
మిత్రుల మధ్య పొరపాట్లు దొర్లితే సర్దుకుంటారు. కానీ.. ప్రత్యర్థుల మధ్య పొరపాట్లు కుదరవు. ఒకవేళ.. నిజంగానే పొరపాటు జరిగినా.. అందుకు ఎంతోకొంత మూల్యం చెల్లించక తప్పని పరిస్థితి. తాజాగా తైవాన్ అలాంటి తప్పే చేసింది. చైనా నుంచి విడిపోయిన ఈ బుల్లి దేశం మీద చైనా అజమాయిషీ చేయటం.. దీనికి తైవాన్ అభ్యంతరం వ్యక్తం చేయటం జరుగుతున్నదే. రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రమే . అలాంటి పరిస్థితుల్లో తాజాగా తైవాన్ చేసిన చర్య ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద సంచలనంగా మారింది.

తైవాన్ దేశ వైమానిక దళం జరిపిన క్షిపణి విధ్వంసక అణు క్షిపణి పొరపాటున చైనా మీదుగా వెళ్లింది. అయితే.. తైవాన్ దీన్ని కావాలని చేసింది కాదు. ఆ దేశ వైమానిక దళం చేసిన పొరపాటు ఇప్పుడు కొత్త ఉద్రిక్తతకు దారి తీసే అవకాశాన్ని ఇచ్చింది. ఇంతకీ ఈ భారీ తప్పు ఎలా జరిగిందన్న విషయాన్నిచూస్తే.. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో 300 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించే స్వదేశీ సియుంగ్ – ఫెండ్ 3 అనే అణుక్షిపణిని ప్రయోగించింది. సోయింగ్ నగర పరిధిలోని సముద్ర జలాల్లో ఉన్న నౌక ద్వారా పరీక్షలు జరపగా.. అది చైనా వైపు దూసుకెళ్లినట్లుగా తైవాన్ చెబుతోంది.

అయితే.. ఈ క్షిపణి చైనాలో భాగమైన పెంగూకు 75 కిలో మీటర్ల దూరంలో సముద్రంలో పడిపోయింది. జరిగిన తప్పును చైనా గుర్తించే లోపే.. తైవాన్ స్పందించింది. తమ వల్ల తప్పిదం జరిగిందని.. ఎలా జరిగిందన్న విషయంపై దర్యాప్తు కూడా ప్రారంభించినట్లుగా పేర్కొంది. ఈ ఘటనపై చైనా ఇంకా రియాక్ట్ కాలేదు.
Tags:    

Similar News