ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా నిలిచిన ప్రేమ మందిరం తాజ్‌మహల్ నిజంగా ప్రార్థనా మందిరమా? లేక సమాధా? దీనిపై ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. అలా నమోదైన ఓ కేసులో ఆసక్తికరమైన వాదన వినిపించారు. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ ఐ) వారు.2015 ఏప్రిల్ లో ఆగ్రా జిల్లా కోర్టు లో ఓ కేసు ఫైల్ అయింది. అది ఏంటంటే.. తాజ్ మహల్ ఓ సమాధి కాదు.. అది శివుని గుడి అని. అంతే కాదు.. హిందూ భక్తులను తాజ్ మహల్ లోనికి అనుమతించాలని ఆరుగురు లాయర్ల బృందం సూట్ ను ఫైల్ చేసింది. 2015లో లోక్ సభలో ఈ అంశంపై పెద్ద చర్చే జరిగింది.
2015 నవంబర్ లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లోక్ సభ లో తాజ్ మహల్ పై వివరణ కూడా ఇచ్చింది. తాజ్ మహల్ లో గుడి ఉన్నట్లు ఎటువంటి సాక్ష్యం లేదని చెప్పింది. అయితే ఈ కేసుపై వివరణ ఇవ్వాలంటూ ఆగ్రా జిల్లా కోర్టు కేంద్ర ప్రభుత్వం - కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ - హోం సెక్రటరీ - ఏఎస్ ఐ లకు నోటీసులు జారీ చేసింది. కోర్టు నోటీసులకు ఇటీవలే సమాధానం పంపించిన ఏఎస్ ఐ... తాజ్ అనేది ఒక ఇస్లామిక్ స్ట్రక్షర్ అని.. ఆ తర్వాత దాన్ని వివిధ మతాలు దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయని.. ప్రత్యేకమైన మతానికి చెందినది గా ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేవని తేల్చింది. వచ్చే సెప్టెంబర్ 11 న దీనిపై కోర్టు ఏఎస్ఐ వాదనలు విననుంది. తాజ్ మహల్ గుడి కాదు మొర్రో.. అది ఓ సమాధి అంటూ నెత్తి నోరు మొత్తుకుంటున్నా ఎవరూ నెత్తికెక్కించుకోవట్లేదంటన్నారు ఏఎస్ఐ అధికారులు వాపోతుండటం గమనార్హం.
కాగా, తాజ్ కు ఉన్న చరిత్ర ప్రకారం అతి పురాతనమైన ఈ కట్టడానికి ప్రభుత్వం కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే.. ఇది ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. ప్రపంచంలోనే ఏడో వింతగా నిలిచి రికార్డు సృష్టించింది తాజ్ మహల్. క్రీ.శ. 1632 లో మొఘల్ సామ్రాజ్య రాజు షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ సమాధిని ఇక్కడ నిర్మించి దానికి తాజ్ మహల్ అని పేరు పెట్టాడు. ఆగ్రా లోని యమునా నది ఒడ్డున ఉండే ఈ కట్టడాన్ని 1920 లో బ్రిటీష్ కాలంలోనే ప్రొటెక్టడ్ మాన్యుమెంట్ గా డిక్లేర్ చేయడం జరిగింది.
అంతే కాదు.. తేజో మహాలయ మందిర్ ఇప్పుడు ఉన్న తాజ్ మహల్ స్థానంలో ఒకప్పుడు ఉండేదని ఆగ్రా కోర్టులో వేసిన పిటిషన్ తప్పంటూ ఏఎస్ఐ వివరణ ఇచ్చింది. క్రీ.శ. 12 వ శతాబ్దంలో ఇప్పుడు ఉన్న తాజ్ మహల్ స్థానంలో రాజా పరమర్ది దేవ్ తేజో మహాలయ టెంపుల్ ప్యాలెస్ ను నిర్మించాడని... ఆతర్వాత ఆ గుడిని రాజా మాన్ సింగ్ స్వాధీనం చేసుకున్నాడని... ఆ తర్వాత జైపూర్ మహారాజు దాన్ని స్వాధీనం చేసుకున్నాడని.. ఆ తర్వాత షాజహాన్ రాజుగా ఉన్నప్పుడు దాన్ని తాజ్ మహల్ గా మార్చాడంటూ తమ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ లో పేర్కొన్న వివరాలను తప్పుడు వివరాలంటూ ఏఎస్ఐ తమ వాదనలను సెప్టెంబర్ 11 కోర్టుకు వినిపించనున్నట్లు తెలిపింది. ఈ వాదనలతో అయినా తాజ్‌పై నెలకొన్న తర్జనభర్జనలకు ఫుల్‌స్టాప్ పడుతుందేమో చూడాలి మరి!