ముస్లిం తీవ్రవాదం పెట్రేగిపోతోందనే ఆరోపణలు పెద్ద ఎత్తున రావడం, సొంత గడ్డపైనే రాక్షస చర్యలకు ఒడిగట్టి ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఒక్కో ముస్లిం దేశం మేలుకుంటోంది. లౌకిక భావాలకు పెద్ద పీట వేసే నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోంది. ఈ క్రమంలో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంటోంది.
మధ్య ఆసియా ముస్లిం మెజారిటీ దేశమైన తజికిస్థాన్...ముస్లిం తీవ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పొరుగు దేశం ఆఫ్ఘనిస్థాన్ ప్రభావం తమపై పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. లౌకిక నాయకత్వంలో కొనసాగుతున్న తజికిస్థాన్ ఈ క్రమంలో ముందడుగు వేసిందని అల్ జజీరా చానెల్ ఓ కథనంలో తెలిపింది. ఇంతకీ తజికిస్తాన్ ఏం చేసిందంటే... ఆ దేశ పోలీసులు తాజాగా 13వేల మంది ముస్లిం పురుషులకు గడ్డాలు గీయించారు! ముస్లిం సంప్రదాయ వస్త్రాలను అమ్మే 160 దుకాణాలను మూసివేయించారు! అంతేకాకుండా బురఖా ధరించకుండా 1700 మంది మహిళల్ని ఆ దేశ ప్రభుత్వం ఒప్పించింది కూడా.
దేశంలో లౌకిక భావనను పెంపొందించి.. విదేశీ ప్రభావాలను ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్ ప్రభావం తమపై పడకుండా చాలాకాలంగా జాగ్రత్త వహిస్తోంది. ముస్లిం తీవ్రవాదాన్ని నిరోధించేందుకు వీలుగా తజికిస్థాన్ అధ్యక్షుడు ఇమొమాలి రఖ్మోన్ కొత్త చట్టాలు తేవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో రాడికల్ ఇస్లామిజాన్ని నిరోధించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. గతవారం తజికిస్థాన్ పార్లమెంటు అరబ్ ధ్వనించే పదాలను నిషేధించింది. అలాగే, ఫస్ట్ కజిన్స్ మధ్య వివాహ సంప్రదాయాన్నీ నిషేధించింది. ఫస్ట్ కజిన్స్ పెళ్లి చేసుకునేందుకు ఇస్లాం మతంలో అనుమతి ఉండటం ఇక్కడ కొసమెరుపు. ఇక గత ఏడాది తజికిస్థాన్ సుప్రీంకోర్టు ఇస్లామిక్ రినైజాన్స్ పార్టీని నిషేధించింది. దేశంలో మతహింస చోటుచేసుకోవడంతో రాడికల్ ఇస్లామిజమే ఇందుకు కారణమంటూ తొలి ఇస్లామిక్ రాజకీయ పార్టీ అయిన ఇస్లామిక్ రినైజాన్స్ పార్టీని రద్దు చేసింది.
మొత్తంగా ప్రజాస్వామ్య పరిమళాలను ఆస్వాదించేందుకు ఆ దేశం వేగంగా సిద్ధమవుతోంది. మిగతా ముస్లిం దేశాలు, ఆ వర్గం ప్రజలు పెద్ద ఎత్తున దేశాలు తజికిస్తాన్ నిర్ణయంపై ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి మరి.