సైకిల్ గుర్తు మీద సనత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ తర్వాత కారులోకి షిఫ్ట్ కావటం.. ఆయన తెలంగాణ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టటం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి.. టీఆర్ఎస్ సర్కారులో మంత్రిగా బాధ్యతలు ఏ విధంగా నిర్వహిస్తారంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నా చప్పుడు చేయని తలసాని తాజాగా కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్లపై స్పందించారు.
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కానీ 15 స్థానాల్లో గెలిస్తే.. తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాలు విసిరారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఒక టీవీ ఛానల్ నిర్వహించిన ఒక చర్చాకార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసానిని.. కాంగ్రెస్.. తెలుగుదేశం నేతలు తమ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. ఈ సందర్భంగా రియాక్ట్ అయిన తలసాని.. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కానీ 15 సీట్లలో గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. సో.. తలసాని మంత్రి పదవి కాంగ్రెస్ సాధించే సీట్ల మీద ఉందన్నమాట.