తెలంగాణ టీడీపీ నేత - టీడీఎల్పీ ఉపనేత - కొడంగల్ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన రేవంత్.. తర్వాత కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ గూటికి చేరిపాయరు. ఈ క్రమం లో ఆయన ఏపీ టీడీపీ నేతలు సహా తెలంగాణ టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు సైతం సంధించారు. తెలంగాణ టీడీపీ నేతలు కేసీఆర్ కు అమ్ముడుపోయారని అన్నారు. ఏపీ టీడీపీ నేతలు.. కూడా కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారని వ్యాపారాలు చేసుకుంటున్నారని విరుచుకుపడ్డారు. ఇక, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు.
అయితే, రేవంత్ రెడ్డి గురించి తెలంగాణ మంత్రి - టీడీపీ మాజీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ లో చేరి రేవంత్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రమని... రేవంత్ ను ఆ పార్టీ నేతలు ఎదగనిస్తారా అనే అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీలో రేవంత్ కు ఒక పదవి ఉండేదని, ఒక ఆఫీస్ - ఒక ఛాంబర్ ఉండేవని... రాష్ట్రంలోని ఏ జిల్లాలోనైనా పర్యటించి, తన గళం వినిపించే స్వేచ్ఛ ఉండేదని గుర్తు చేశారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ జిల్లాల్లో పర్యటించగలరా? అని తలసాని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలెవరూ కూడా ఇతర నేతలు తమ ఇలాఖాలోకి రావడాన్ని ఇష్టపడరని... తాము ఓటమిపాలైనా సరే వేరే నేతను అడుగుపెట్టనీయరని చెప్పారు. అంతేకాదు.. రేవంత్ దూకుడు స్వభావం ఉన్న నేత కావడం, కాంగ్రెస్ లో పెద్దగా దూకుడు లేని నేతలు కావడంతో వీరు రేవంత్ ను ఎదగనిచ్చే ఛాన్స్ లేదని కూడా తలసాని స్పష్టం చేశారు. మరి ఈ కామెంట్లపై ఇటు కాంగ్రెస్ సీనియర్లు, అటు రేవంత్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.