ఇంతకాలం ఉప ఎన్నికలు అన్న పదం వినిపిస్తేనే ఇంట్లో దూరి తలుపులేసుకున్న టీడీపీ నుంచి జంప్ చేసిన టీఆరెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు వీధిలోకి వచ్చి తొడలుకొడుతున్నారు. గ్రేటర్ రిజల్ట్ చూసిన తరువాత బస్తీమే సవాల్ అంటున్నారు. ఉప ఎన్నికలంటే తమకు భయమేంటని బీరాలు పలుకుతున్నారు. ఉప ఎన్నికలకు ఆల్వేజ్ రెడీ అంటూ ఫుల్ కాన్ఫిడెన్సు చూపిస్తున్నారు. ఇప్పటికే కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇలా సవాల్ విసరగా తాజాగా తలసాని శ్రీనివాసయాదవ్ కూడా ఉప ఎన్నికకు నేను రెడీ అంటున్నారు.
టీడీపీ నుంచి గెలిచిన తలసాని ఎన్నికల తరువాత టీఆరెస్ లో చేరి ఆ ప్రభుత్వంలో మంత్రి పదవి అందుకున్నారు. అది అనైతికమని.. ఆయనపై వేటేయాలని టీడీపీ స్పీకరుకు, ఎన్నికల సంఘానికి, చివరకు కోర్లులోనూ ఫిర్యాదు చేసింది. తలసానికి దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని వందలసార్లు సవాళ్లు విసిరింది. రాజీనామా, ఉప ఎన్నిక అన్న మాట వింటేనే తలసాని ఉలిక్కి పడేవారు. సీనియర్ నేతగా భయపడితే బాగుండదు కాబట్టి అప్పుడప్పడు ఉప ఎన్నికకు రెడీ అంటూ మేకపోతు గాంభీర్యం చూపించేవారు. అలాంటిది ఇప్పుడు గ్రేటర్ లో గులాబీ రెపరెపలు చూసిన తరువాత ఆయన నిజంగానే సింహంలా గాంభీర్యం చూపిస్తున్నారు. సనత్ నగర్ లో ఉప ఎన్నికకు నేను రెడీ అంటూ జబ్బలు చరుస్తున్నారు.