తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోమారు ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి.. ఈ సందర్భంగా బాబుపై సంచలన విమర్శలు చేశారు. చంద్రబాబు రిటైర్మెంట్ కు టైమ్ దగ్గర పడిందని వ్యాఖ్యానించారు. ``చంద్రబాబు ముందు సినిమా ఇండస్ట్రీలో ఎవరూ పనికిరారు. అయితే, చంద్రబాబు మాకొద్దని ఆల్ రెడీ జనం డిసైడ్ అయ్యారు. చంద్రబాబు పరిస్థితి కూడా మహానాయకుడు సినిమాలాగే అయితది.మహనాయకుడు నడవక పోతే బాలకృష్ణ ఇంట్లో పడుకున్నాడు. బాబుది అదే జరుగుతుంది. ` అని తలసాని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు నంగనాచి కబుర్లు చెప్పడం ఆపాలని తలసాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒక్కడే తెలుగోళ్ల కోసం పనిచేస్తున్నాడా? చంద్రబాబు వ్యవహారమంతా ఆలీబాబా 40 దొంగల్లా ఉంది. చంద్రబాబు ఓడిపోయినంక మళ్లీ హైదరాబాదే వస్తడు. చంద్రబాబు అమరావతిలో ఉండలేడు. రేవంత్‌రెడ్డి కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు. ఏపీ ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మొద్దు. బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకోవడానికే హెరిటేజ్ కంపెనీని స్థాపించారు. జూబ్లీహిల్స్ లో చంద్రబాబు ఇంటి విలువ రూ.20 కోట్ల పైమాటే. చంద్రబాబు మనుమడు పేరు మీదే రూ.85 కోట్ల ఆస్తి ఉంది``అని సంచలన ఆరోపణలు చేశారు.
ఎన్నికలు అయిపోయాక ఆంధ్రా ప్రజలకు చంద్రబాబు సున్నం పెడ్తారని తలసాని మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు డైరెక్ట్‌గా చంద్రబాబు ఫోటో పెట్టుకుంటే సరిపోతది. అట్లయితే ఇది చంద్రబాబు పేపర్ అని జనానికి కూడా క్లియర్ గా తెలుస్తుంది. చంద్రబాబు లాంటి దౌర్భాగ్యపు గుణం మాకు లేదు. ఎవరి సభలకైనా తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తుంది. కూకట్ పల్లిలో నమోదైన ఐటీ గ్రిడ్స్ కంపెనీ కేసు ఏపీకి పంపిస్తరా? చంద్రబాబు స్వార్థం కోసం ప్రజలను బలిపెడుతున్నాడు. అంటూ విరుచుకుపడ్డారు. ఏ ప్రాజెక్టు లో అయిన 10 శాతం వాటా లోకేష్ తీసుకుంటారు అని సంచలన ఆరోపణలు చేశారు. ``ఏపీలో జీరో శాతం అవినీతి ఉంటే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా.ఏపీలో టీడీపీ నేతలు డబ్బులు పంచుతే చెప్పుతో కొట్టాలని ఏపీ ప్రజలను కోరుతున్న`` అంటూ సంలచన వ్యాఖ్యలు చేశారు.