అఫ్గానిస్తాన్ ను మళ్లీ తమవశం చేసుకున్న తాలిబన్లు అందరూ భయపడుతున్న విధంగానే మహిళలపై ఉక్కుపాదం మోపే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలోనే కో-ఎడ్యుకేషన్ ను రద్దు చేస్తూ తొలి ఫత్వా జారీ చేశారు. తమ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యానికి తావేలేదని, అంతా షరియత్ చట్టాల ప్రకారమేనని ఇప్పటికే కరాఖండిగా తేల్చి చెప్పిన తాలిబన్లు ఆవైపుగానే నిర్ణయాలను తీసుకుంటున్నారు.
తాజాగా హెరాత్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కో-ఎడ్యుకేషన్ విధానాన్ని నిషేధిస్తూ ఆదేశాలు విడుదల చేశారు. మాట వినని వారిపై ఇప్పటికే కాల్పులు జరిపి హతమారుస్తున్న తాలిబన్లు, నేడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని అన్ని విద్యాసంస్ధలు, యూనివర్శిటీలు, పాఠశాలల్లో కో ఎడ్యుకేషన్ ను నిషేధించారు. అన్ని ప్రభుత్వ , ప్రైవేటు విద్యాసంస్ధల అధికారులతో సమావేశమైన తాలిబన్ నేతలు, ఈ మేరకు ఫత్వా జారీ చేశారు. ఆప్ఘన్ పగ్గాలు తీసుకున్న తర్వాత తాలిబన్లు జారీ చేసిన తొలి ఫత్వా ఇదే కావడం విశేషం.
మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేసిన కొన్ని రోజులకే తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. తాలిబన్ అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఆడ, మగ పిల్లలు కలిసి చదువు కోవడాన్ని నిషేధించారు. అంతేకాదు సమాజంలోని అన్ని దుర్మార్గాలకు అదే మూలం అని వర్ణించడం గమనార్హం. కో-ఎడ్యుకేషన్ ను నిలిపివేయాల్సిందేనని, వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. అలాగే మహిళా లెక్చరర్లు కేవలం మహిళా విద్యార్థులకు మాత్రమే బోధించడానికి అనుమతి ఉంటుంది తప్ప, పురుషులకు బోధించే అవకాశం ఉండదని కూడా వెల్లడించారు.
కాగా గత రెండు దశాబ్దాలలో, అఫ్గాన్ లోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఇనిస్టిట్యూట్లలో కో-ఎడ్యుకేషన్, జెండర్ బేస్‌డ్ ప్రత్యేక తరగతుల మిశ్రమ వ్యవస్థను అమలు చేసింది. అధికారిక అంచనాల ప్రకారం హెరాత్ లో ప్రైవేట్, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 40వేలమంది విద్యార్థులు, 2వేల లెక్చరర్లు ఉన్నారు. వాస్తవానికి రెండు దశాబ్దాల క్రితం ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాకముందు తాలిబన్లు ఈ ఫత్వా జారీ చేశారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం స్ధానంలో అధికార పగ్గాలు చేపడుతున్న నేపథ్యంలో అధికారికంగా ఈ నిర్ణయాన్నిు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. దీన్ని ఉల్లంఘించిన వారికి తాలిబన్లు వారి శైలిలో శిక్షలు అమలు చేస్తారు. తాలిబన్ల హెచ్చరికలతో తమ విద్యాసంస్ధల్లో ఈ నిర్ణయం అమలు చేసేందుకు నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.