మహిళలు బ‌య‌ట‌కు రావొద్దు…తాలిబ‌న్ల సంచలన నిర్ణ‌యం

Update: 2021-08-26 04:30 GMT
ఆఫ్ఘన్ లో పరిస్థితి రోజురోజుకి మరింతగా దిగజారుతోంది. ప్రభుత్వంలో మహిళలు భాగం కావొచ్చని ఇటీవల ప్రకటించిన తాలిబన్లు.. అంతలోనే మాటమార్చారు. మహిళలపై ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్నారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఇండ్ల నుంచి ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావొద్దని ఆదేశించారు. భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే వీధుల్లోకి రావాలని, భద్రతా చర్యలు మెరుగయ్యేంతవరకూ ఈ ఆదేశాలను పాటించాలన్నారు. ఈ నెల 31లోపు అమెరికా తరలింపు ప్రకియను పూర్తిచేయాలని స్పష్టంచేశారు. ఎట్టిపరిస్థితుల్లో డెడ్‌ లైన్‌ ను పొడిగించేదిలేదని తెగేసి చెప్పారు. పంజ్‌ షీర్‌ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అఫ్గాన్‌ నిపుణుల తరలింపును అమెరికా చేపడుతున్నదని,దీన్ని నిలిపివేయాలన్నారు.

పౌరులు, ఉద్యోగుల ఇండ్లల్లోకి చొరబడి సోదాలు చేస్తూ తాలిబన్లు మానవహక్కులను కాలరాస్తున్నారని అఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్‌ ఆరోపించారు. తాలిబన్ల అకృత్యాలను ఎవరైనా ప్రతిఘటిస్తే, మహిళలు, పిల్లలను రక్షణ కవచంగా వాడుతున్నట్టు తెలిపారు. దీని కోసం ఇప్పటికే వందలాది మంది మహిళలు, పిల్లలను వాళ్లు అపహరించినట్టు చెప్పారు. తమను తాలిబన్లు కిడ్నాప్‌ చేస్తారేమోనన్న భయంతో వేలాది మంది మహిళలు, చిన్నారులు కొండలు, అడవుల్లోకి పారిపోయి తలదాచుకుంటున్నట్టు వెల్లడించారు.

ఇదిలా ఉంటే .. బయట పనిచేసే మహిళలెవరూ ఇల్లు విడిచి వెళ్లొద్దని, ఇంట్లోనే ఉండాలని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే, అది కొన్నాళ్లు మాత్రమేనని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పారు. మహిళలు పనిచేసే ప్రదేశాల్లో అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకునేంత వరకు ఇంట్లో ఉండాలని సూచించారు. ప్రభుత్వ మహిళా అధికారుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇంతకుముందులాగానే ఇప్పుడూ మహిళలపై తాలిబన్లు ఆంక్షలు విధిస్తారన్న భయాల మధ్యే తాలిబన్లు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం ఆఫ్ఘన్ మహిళలను ఆందోళనకు గురి చేస్తోంది. మహిళలపై ఆంక్షలు విధించబోమని, షరియా చట్టానికి లోబడి వారికి అవకాశమిస్తామని తాలిబన్లు ఇప్పటికే ప్రకటించినా దానిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే, తాము ప్రతీకారం తీర్చుకోవడానికి రాలేదని, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని ముజాహిద్ చెబుతున్నారు. సమగ్ర వ్యవస్థ ఏర్పాటైన తర్వాత మహిళా ఉద్యోగులు విధుల్లోకి రావాల్సిందేనన్నారు. ఇప్ప‌టికే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల‌దీస్తున్న మ‌హిళ‌లు తాలిబ‌న్ల నిర్ణ‌యంతో మ‌రింత భ‌యాందోళ‌న‌లు క‌లుగుతున్నాయి

ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకు రావొద్దని తాలిబన్లు హెచ్చరికలు జారీ చేశారు. భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే బయటకు రావాలని ఆదేశించారు. మరోవైపు తమ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకోవడం వెనుక పొరుగు దేశమైన పాకిస్తాన్‌ హస్తం ఉందని అఫ్గనిస్తాన్‌ పాప్‌స్టార్‌ అర్యానా సయీద్‌ ఆరోపించారు. అఫ్గన్‌ ప్రభుత్వం తాలిబన్లపై చర్యలకు ఉపక్రమించిన ప్రతిసారీ, పాక్‌ ఏదో ఒక విధంగా జోక్యం చేసుకునేదన్నారు. భారత్‌ మాత్రం ఇందుకు పూర్తి భిన్నమని, అఫ్గనీయులకు ఎంతో సహాయం చేసిందని ధన్యవాదాలు తెలిపారు. శరణార్థులను అక్కున చేర్చుకున్న భారత్‌.. తమ దేశానికి నిజమైన స్నేహితుడు అని కృతజ్ఞతాభావం చాటుకున్నారు. 
Tags:    

Similar News