ఆప్ఘనిస్తాన్ దేశం తాలిబన్ల వశమైంది. దేశ రాజధాని కాబుల్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు.. కాబుల్ నగరంలో తాలిబన్ల జెండా ఎగురవేసి ఇక తమ దేశం తమ ఆధీనంలోకి వచ్చిందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలు జరుపుతామని అంటున్నా తాలిబన్లు మాత్రం అందుకు అంగీకరించే వాతావరణం కనిపించడం లేదు. తాలిబన్లు అధ్యక్ష భవనంలోకి చొచ్చుకు రావడంతో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తన కుటుంబం, స్టాఫ్ తో కలిసి పక్కదేశం ఉబ్జెకిస్తాన్ కు పారిపోయాడు.
ఇక ఇప్పటికే ఆక్రమించుకున్న ప్రదేశాల్లో తాలిబన్లు సామాన్యులపై ఆగడాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, బాలికలను కిడ్నాప్ చేస్తున్నారని అంటున్నారు. ప్రపంచమంతా ఇప్పుడు అప్ఘనిస్తాన్ గురించే చర్చించుకుంటుంది. ఈ నేపథ్యంలో అసలు తాలిబన్లు ఎవరు..? వీరి ప్రస్థానం ఎక్కడ మొదలైంది..? అనే విషయాలను పరిశీలిస్తే..
తాలిబన్ అంటే విద్యార్థి అని అర్థం. 1990 తొలినాళ్లలో పాకిస్తాన్లోని ఆదివాసీ ప్రాంతాల్లో ఫఖ్తూన్ హక్కుల కోసం తాలిబన్ల ఉద్యమం మొదలైంది. ఇందులో సున్నీలు ఎక్కువగా పాల్గొనే వారు. వీరికి సౌదీ అరేబియా దేశం నుంచి సహకారం ఉండేది. తమకు అధికారం ఇస్తే పఖ్తూన్ ప్రాంతాల్లో శాంతి భద్రతలు నెలకొల్పుతామని అన్నారు. ఇలా నైరుతి అప్ఘనిస్తాన్ నుంచి 1995 లో ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న హెరాత్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత అప్ఘాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేరశారు. అప్పటి అధ్యక్షుడు బుర్హనుద్దీన్ రబ్బానీనీ పదవీ నుంచి తప్పుకునేలా చేశారు. 1998 నాటికి తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ ను 90 శాతం తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
తాలిబన్ల ఆధీనంలో ఉన్ అప్ఘనిస్తాన్ లో కఠినమైన రూల్స్ పెట్టారు. మోసం చేసినవారిని ఉరి తీయడం, దొంగతనం చేసిన వారికి కాళ్లు, చేతులు విరగ్గొట్టడం చేసేవారు. అలాగే పురుషులందరూ కచ్చితంగా గెడ్డం పెంచాలనే నిబంధన పెట్టారు. మహిళలు బురఖా ధరించాలని చెప్పారు. అలాగే టీడీ చూడొద్దని, సినిమాలకు వెళ్లొద్దని, సంగీతాన్ని వినొద్దని ఆదేశించేవారు. 10 ఏళ్లు నిండిన అమ్మాయిలను ఇంటిపట్టునే ఉండాలని చెప్పేవారు.
తాలిబన్లు ఇలా మానవ హక్కులను కాలరాసి విధ్వంసానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇక వీరి ఆగడాలకు సౌదీ అరేబియా, యునైడెట్ అరబ్ ఎమిరేట్స్ తో పాటు పాకిస్తాన్ కూడా మద్దతు ఇచ్చేది. 2012లో మింగోరా పట్టణంలో మలలా యూసఫ్ జాయిపై తాలిబన్లు జరిపిన కాల్పులపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. రెండేళ్ల తరువాత పాకిస్తాన్లోని పెషావర్లో స్కూలు పిల్లలపై జరిగిన దాడితో పాకిస్తాన్ ప్రభుత్వం తాలిబన్ల ప్రాధాన్యాన్ని తగ్గించింది. 2013లో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో తాలిబన్ కు చెందిన హకీముల్లా మెహసూద్ మరణించాడు.
2001లో న్యూయార్క్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన దాడుల తరువాత తాలిబన్ల గురించి ప్రపంచ చర్చించుకోవడం ప్రారంభించారు. దీంతో 2001 అక్టోబర్ 7న అమెరికా సేనలు అప్ఘనిస్తాన్ పై దాడులు నిర్వహించాయి. ఈ దాడులతో తాలిబన్లు అధికారాన్ని విడిచి పారిపోయారు. 2013లో తాలిబన్లు ఖతార్లో తమ కార్యాలయాన్ని ప్రారంభించడానికి రెడీ అయ్యారు. దీంతో శాంతి చర్చలు జరుగుతాయని భావించారు. అయితే పాకిస్థాన్లోని ఒక హాస్పిటల్ లో ముల్లా ఒమర్ మరణించారు. ముల్లా ఒమర్ డిప్యూటీగా పనిచేసిన ముల్లా మన్సూర్ కు తమ నాయకునిగా మద్దతు తెలుతున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. దీంతో 2001 తరువాత మొదటిసారి అప్ఘాన్ రాజధానిని స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల అమెరికా, తాలిబన్ల మధ్య జరిగిన సుధీర్ఘ చర్చల తరువాత 2020 ఫిబ్రవరిలో తాలిబన్ల వైఖరిలో మార్పు వచ్చింది. దీంతో 2021 ఏప్రిల్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా సేనలను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించాడు. అనుకున్నట్లుగా చేశారు. దీంతో తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ ను ఆక్రమించేస్తున్నారు.