కోయంబ‌త్తూరు .. 70 శాతం మందికి ఆక్సీజ‌న్‌!

Update: 2021-05-16 09:30 GMT
దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే.. కేసుల విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. స‌గం రాష్ట్రాల్లోనే అత్య‌ధికంగా న‌మోద‌వుతున్నాయి. ఈ విధంగా భారీగా కేసులు వెలుగు చూస్తున్న రాష్ట్రాల్లో త‌మిళ‌నాడు ఒక‌టి. గ‌డిచిన నెల రోజుల్లోనే అక్క‌డ 25 ల‌క్ష‌ల‌కుపైగా కేసులు న‌మోద‌వ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది.

రాజ‌ధాని చెన్నైలోనూ భారీగా కేసులు న‌మోదువుతున్నాయి. దీంతో.. ఆ రాష్ట్రంలో దారుణ ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఆసుప‌త్రుల‌న్నీ రోగుల‌తో ఎప్పుడో నిండిపోయాయి. డిశ్చార్జ్ అయ్యేవారు ప‌ది మంది ఉంటే.. జాయిన్ కావ‌డానికి ఎదురు చూస్తున్న‌వారి సంఖ్య వెయ్యి మందికిపైగా ఉంటోందని అంచ‌నా. దీంతో.. రోజురోజుకూ ప‌రిస్థితి భ‌యాన‌కంగా మారిపోతోంద‌ని జ‌నం ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు.

ఇక‌, రాష్ట్రంలో జిల్లాల వారీగా ప‌రిస్థితి చూస్తే.. కోయంబ‌త్తూరు దుస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంది. మిగిలిన జిల్లాల‌తో పోలిస్తే.. కోయంబత్తూరులో వేగంగా, భారీగా కేసులు పెరుగుతున్నాయి. చాలా మంది హోం ఐసోలేష‌న్లో ఉండ‌గా.. అంత‌కు మూడు నాలుగు రెట్ల జ‌నం ఆసుప‌త్రుల్లో చేర‌డానికి చూస్తున్నార‌ట‌.

ఇలాంటి వారిలో దాదాపు 70 శాతం మందికి ఆక్సీజ‌న్ అవ‌స‌రం ఉన్న‌ట్టు స‌మాచారం. ప‌రిస్థితి దారుణంగా ఉండ‌డంతో.. ప్ర‌భుత్వం ఈ జిల్లాపై ప్ర‌త్యేక దృష్టిసారించిన‌ట్టు తెలుస్తోంది. ఈ ప‌రిస్థితి ఎప్పుడు అదుపులోకి వ‌స్తుందో తెలియ‌క జ‌నాలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు


Tags:    

Similar News