స్పందించకపోతే మూత్రం తాగుతామన్న తమిళులు

Update: 2017-04-22 11:17 GMT
కరువు ప్రాంతాల నిధుల కోసం తమిళనాడు రైతులు కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అయ్యారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కేంద్రం తమ డిమాండ్లు పరిష్కరించకపోతే  తమ మూత్రం తామే తాగుతామంటూ సీసాల్లో మూత్రం నింపి నిరసన తెలిపారు.
    
ఈ సమస్యపై కొన్నాళ్లుగా పోరాడుతున్నా కూడా కేంద్రం నుంచి ఏమాత్రం స్పందన లేదని...  కనీసం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కరువు నిధులతో పాటు కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరీ జలాల పంపిణీ కోసం కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  
    
కాగా వీరి నిరసనలు నెల రోజులకు పైగా కొనసాగుతున్నాయి. మార్చి 14నుంచి ఢిల్లీలో వారి నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.  గతంలో కపాలాలతోను - నగ్నంగాను - చనిపోయిన ఎలుకలు - పాములతోను రైతులు నిరసన తెలిపారు. ఇప్పుడు ఇలా మూత్రం తాగుతామంటూ బెదిరించారు. తమిళనాడుకు రూ.2వేల కోట్లు విడుదల చేసినా.. అవి ఏమూలకూ చాలవని వారంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News