అభిమానించాలన్నా.. ఆగ్రహించాలన్నా తమిళులకు సాటి మరెవరూ ఉండరన్న విషయం తెలిసిందే. జస్ట్ అభిమానానికే గుళ్లు కట్టేసి.. పూజలు చేసేయటం వారికి మామూలే. సినిమా యాక్టర్లకే అంతేసి విధేయతను ప్రదర్శించే తమిళులు.. తమను పాలించే వారి పట్ల మరెంత ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తారన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. అహంకారానికి నిలువెత్తు రూపంగా ఉంటూ.. తనను తాను దేవతామూర్తిగా ఫీలయ్యే అన్నాడీఎంకే అధినేత్రి.. అమ్మ జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మామూలుగానే మనుషుల్ని దూరంగా ఉంచే ఆమె.. ఎప్పుడూ కానీ తన దర్శనం అందరికి ఇవ్వటానికి ఇష్టపడరు.
జాతీయ మీడియా మొత్తం ఎలుగెత్తి.. అమ్మ పని అయిపోయిందని.. ఓటమి పక్కా అని తేల్చిసిన తర్వాత.. ఆమె ఎన్నికల్లో విజయం సాధించటం చిన్న విషయం కాదు. అందుకేనేమో.. రెండు రోజుల క్రితం తన మంత్రివర్గంలోని మంత్రులకు సైతం దర్శనం ఇవ్వని అమ్మ.. పట్టలేని ఆనందంతో.. ప్రజలకు దర్శనం ఇచ్చేశారు. రాజసం ఉట్టిపడేలా అమ్మ కుర్చీలో వచ్చి కూర్చోవటం.. కొమ్ములు తిరిగిన మగమహారాజులుగా చెప్పుకునే నేతలు.. పోలీస్ బాసులు మొదలు.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ వంగి వంగి మరీ దండాలు పెడుతున్న సీన్లు టీవీల్లో టెలికాస్ట్ అయి కావాల్సినంత వినోదాన్ని పంచిందని చెప్పాలి.
అమ్మ పట్ల తమిళులు ప్రదర్శించే విధేయత చూసిన తమిళేతరులు ఎవరైనా సరే షాక్ తినాల్సిందే. దేశంలో మరే రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితి అస్సలు కనిపించదనే చెప్పాలి. తన పట్ల ప్రదర్శిస్తున్న విధేయతకు అమ్మ రియాక్షన్ చూస్తే మరింత విస్మయం చెందాల్సిందే. పెద్ద పెద్ద పూలబొకేలు తీసుకొస్తే.. అమ్మ వాటిని పట్టుకోవటం తర్వాత సంగతి.. తన వేలి కొసలతో జస్ట్ టచ్ చేయటం.. అమ్మ పక్కనే ఉండే సెక్యూరిటీ సిబ్బంది వెంటనే వాటిని తమ చేతుల్లోకి తీసుకొని పక్కన పెట్టేయటం కనిపిస్తుంది.
తాము తెచ్చిన బొకేకు అమ్మ వేలు కొస తగిలిందన్న ఆనందంతో ఉబ్బితబ్బుబ్బి పోయి.. వంగి వంగి దండాలు పెట్టినోళ్లు కొందరైతే.. పనిలో పనిగా మరికొందరు ఏకంగా సాష్టాంగ నమస్కారం పెట్టేసిన వైనం టీవీల్లో కనిపించింది. ఏమైనా అతిశయానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే అమ్మ పట్ల తమిళులు ప్రదర్శించే అభిమానం ఎంతో మరోసారి లోకానికి తెలిసిందని చెప్పక తప్పదు.