సెక్స్ స్కాండిల్ కేసులో ఒక్కరిని వదలం: సీఎం కొడుకు హీరో శపథం

Update: 2021-05-07 03:18 GMT
తమిళనాడులోని చెన్నైలో ఇటీవల వెలుగుచూసిన సెక్స్ స్కాం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోలీవుడ్ హీరో కం కాబోయే తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి సంచలన ప్రకటన చేశారు.  ఈ కేసులో ఎవ్వరిని వదిలిపెట్టమని ఈ యువ హీరో శపథం చేశారు.

మా నాన్న స్టాలిన్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పొల్లాచ్చి సెక్స్ స్కామ్ కేసు మళ్లీ తెరమీదకు వస్తుందని.. ఈ కేసులో ఒక్కడిని కూడా వదలమని యువ హీరో ఉదయనిధి స్టాలిన్ బహిరంగ ప్రకటన చేశారు.

ఈ ప్రకటనతో పొల్లాచ్చి సెక్స్ స్కామ్ లో తప్పించుకొని బయట తిరుగుతున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

చెన్నైలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేపాక్ నుంచి పోటీచేసి భారీ మెజార్టీతో ఉదయనిధి గెలిచాడు. ఈ సందర్భంగా ప్రజలను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన పొల్లాచ్చిలో ఇటీవల కలకలం రేపిన లైంగిక వేధింపుల కేసులో నిందితులు ఎవ్వరినీ వదిలిపెట్టమని ఉదయనిధి స్పష్టం చేశారు. తండ్రి స్టాలిన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పొల్లాచ్చి సెక్స్ స్కామ్ లోని నిందితులు అందరికీ చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఉదయనిధి బాధితులకు బహిరంగంగా హామీ ఇచ్చారు.

ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లాచ్చిలో కాలేజ్ చదువుకునే ప్రేమికులు ఈ ప్రదేశానికి వస్తే అమ్మాయిలను బెదిరించి అత్యాచారాలు చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కాలేజీ అమ్మాయిలతోపాటు అమ్మాయిలు, వివాహిత మహిళల మీద పొల్లాచ్చిలో అత్యాచారాలు జరిగాయని వెలుగు చూడడంతో పెద్ద దుమారం రేపింది.  కొందరు వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. ఇన్నిరోజులు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే నాయకులకు రేప్ కేసులతో సంబంధం ఉందనే ఆరోపనలున్నాయి. అన్నాడీఎంకే పార్టీ విద్యార్థి విభాగంగా నేతలు ముగ్గురిని సీబీఐని అరెస్ట్ చేసింది. మొత్తం 8మంది అరెస్ట్ అయ్యారు.

ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కేసు తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలోకి రావడంతో తెరపైకి వచ్చింది. కాబోయే సీఎం కొడుకు ఉదయనిధి ఈ కేసును బయటకు తీయడంతో అన్నాడీఎంకే పార్టీలోని కొందరు హడలిపోతున్నారు.
Tags:    

Similar News