ఏపీ స్పీకర్ గా తమ్మినేని.. జగన్ నిర్ణయం.!?

Update: 2019-06-07 07:46 GMT
ఏపీ శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాంను ఖాయం చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తాజా సమాచారం. వైసీపీ శాసనాసభా పక్ష సమామేశం తాజాగా అమరావతిలో జరిగింది. ఈ సందర్భంగా జగన్ ఏపీ మంత్రివర్గ కూర్పు, స్పీకర్ , డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులపై దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఏపీ శాసనసభా స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యేకు జగన్ అవకాశం ఇచ్చినట్టు సమాచారం.  శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత తమ్మినేని సీతారాంకు ఏపీ శాసనసభ స్పీకర్ గా దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. కళింగ - బీసీ సామాజికవర్గం కావడం.. పైగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లా అయిన శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఈయననే స్పీకర్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది..

తమ్మినేని సీతారాం ఆరోసారి ఎమ్మెల్యేగా ఆముదాలవలస నుంచి గెలిచారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 40 ఏళ్లు గా రాజకీయంలో ఉన్నారు. శాసనసభా వ్యవహారాలపై ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. 1977లో సీతారాం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వైసీపీ శాసనసభా పక్షం సమావేశం ముగిశాక వైఎస్ జగన్ ను సీతారాం కలవడం.. స్పీకర్ పదవిపై చర్చించడంతో ఈ మేరకు ఈయనే అని కన్ఫం అవుతోంది.

శ్రీకాకుళం నుంచి ధర్మానా ప్రసాద్ రావు మంత్రిగా చేపట్టడం ఖాయం. అయితే సీనియర్ అయిన అదే జిల్లాకు చెందిన తమ్మినేనిని విస్మరించకుండా జగన్ ఈ అత్యున్నత పదవిని కట్టబెట్టినట్లు సమాచారం.


Tags:    

Similar News