స్పీకర్ పదవిని స్వీకరించడానికి చాలా మంది సీనియర్లు అంత సుముఖంగా ఉండరు. ఇది వరకూ అలాంటి సన్నివేశాలే చోటు చేసుకున్నాయి. స్పీకర్ పదవిలో కూర్చోవాలని తమ పార్టీలోని నేతలను ముఖ్యమంత్రులు బతిమాలాల్సి వచ్చింది. స్పీకర్ పదవి లో స్వతంత్రం ఉండదని చాలా మంది నేతలు ఫీల్ అవుతారు. దీంతో ఆ పదవి వద్దని, మంత్రిపదవి కావాలని అంటూ ఉంటారు.
ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీకి నూతన స్పీకర్ గా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రతిపాదనలో ఉన్న తమ్మినేని సీతారాం ఆసక్తిదాయకంగా స్పందించారు. స్పీకర్ పదవి తనకు దక్కడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద బాధ్యతను అప్పగించారని, ఆ బాధ్యతలను నెరవేర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానంటూ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
అంతే కాదు.. తనకు స్పీకర్ పదవి దక్కడం తమ ప్రాంతానికి, బీసీలకు దక్కిన గుర్తింపు అని తమ్మినేని అన్నారు. తనకు స్పీకర్ పదవి దక్కవడం ‘కళింగ సీమకు దక్కిన కంఠాభరణం’ అని తమ్మినేని వ్యాఖ్యానించడం విశేషం. తనకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నెరవేరుస్తానంటూ ఆయన ప్రకటించారు.
శాసనసభలో అధికార, ప్రతిపక్ష పార్టీలను సమన్వయం చేసుకుంటూ పని చేయబోతున్నట్టుగా తమ్మినేని ప్రకటించారు. స్పీకర్ గా తమ్మినేని ఎన్నిక ఏకగ్రీవంగా ఉన్నట్టే. శాసనసభలో టీడీపీకి ఉన్న బలం కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలే కాబట్టి..ఆ పార్టీ నుంచి ఎలాంటి పోటీ ఉండదని చెప్పవచ్చు.