కొత్త హంగులతో మార్కెట్లోకి రాబోతున్న టాటా నానో..!

Update: 2022-12-14 01:30 GMT
ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా తన డ్రీమ్ ప్రాజెక్టుగా ‘ టాటా నానో కారు’ను తయారు చేయించారు. కేవలం లక్ష రూపాయలనే కారు ధరగా నిర్ణయించి సంచలనం సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా ‘నానో కార్డు’ సరికొత్త రికార్డును సృష్టించింది. 2008 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన నానో కారు అనుకున్న స్థాయిలో మాత్రం విజయవంతం కాలేదు.

నానో కారు అత్యంత చిన్నగా ఉండటం.. ఫీచర్స్ సైతం తక్కువగా ఉండటంతో అందరి మన్నలను పొందలేక పోయింది. కేవలం కొంతమంది సామాన్యులు.. మధ్యతరగతి ప్రజలు నానోను కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే 2018 నుంచి నానో కారు ఉత్పత్తులను టాటా కంపెనీ నిలిపివేసింది. అయితే తాజాగా టాటా కంపెనీ మరో గుడ్ న్యూస్ చెప్పబోతుందని ప్రచారం జరుగుతోంది.

టాటా కంపెనీ మరోసారి నానో కారును మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లతో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం భారత్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ కు భారీ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో టాటా నానో కారును ఎలక్ట్రిక్ వర్షన్ లో తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. 2025 నాటికి టాటా నానో ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి రానుందని సమాచారం.

ఇదే కనుక నిజమైతే భారత్ లో నానో శకం ప్రారంభం అవుతుందనే ఆటో మొబైల్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ టాటా నానో ఫీచర్స్ విషయానికొస్తే..  72 వీ లిథియం అయాన్ బ్యాటరీతో టాటా నానో కారు మార్కెట్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉండనుంది.

ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ స్పీడు గంటకు 110 కిలో మీటర్లు ఉండనుందని.. కేవలం 10 సెకన్ల వ్యవధిలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందిపుచ్చుకోనుందని సమాచారం. ఇక ఈ ఎలక్ట్రిక్ నానో కారు ధర రూ.2లక్షల నుంచి 3లక్షల మధ్యలో ఉండొచ్చని  మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ కొత్త కారు ఆటో మొబైల్ రంగంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News