పర్యాటకులను ఆకర్షించడంలో దుబాయ్ స్టైలే సపరేట్ అన్నట్లుగా మారిపోయింది. దుబాయ్ లో ఏ వస్తువు కొన్న జీరో ట్యాక్స్.. లేదంటే తక్కువ ట్యాక్స్ మాత్రమే ఉంటుంది. ఒక్క మద్యం విషయంలో మాత్రమే ప్రభుత్వం ఇప్పటివరకు కఠినంగా వ్యవహరిస్తూ వస్తుంది. మొన్నటి వరకు కూడా దుబాయ్ లో మద్యం పైనే 30 శాతం ఉండేది.
ఈ ఒక్క అంశమే పర్యాటకులను తీవ్రంగా ఇబ్బంది పెట్టేదిగా మారింది. అయితే కొత్త ఏడాదిలో మాత్రం దుబాయ్ సర్కార్ మద్యంప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. పర్యాటకులను ఆకర్షించే క్రమంలోనే ఆల్కహాల్ పై ట్యాక్ ను రద్దు చేయడంతో పాటు లిక్కర్ లైసెన్స్ ను ఫ్రీగా మార్చేసింది. దీంతో దుబాయ్ కు వెళ్లే పర్యాటకులు ఎగిరి గంతేస్తున్నారు.
2023 జనవరి ఒకటి నుంచి దుబాయ్ లోని రెండు ప్రభుత్వ లిక్కర్ కంపెనీలు మారిటైమ్ అండ్ మెర్సంటైల్ ఇంటర్నేషనల్.. కూడా లిక్కర్‌పై ట్యాక్స్.. లిక్కర్ లైసెన్స్ ఫీని రద్దు చేస్తున్నట్లు దుబాయ్ రాజ కుటుంంబం ప్రకటన చేసింది. ఈ రెండు లిక్కర్ కంపెనీలు ఎమిరేట్స్ గ్రూప్‌లో భాగంగానే ఉన్నాయి.
గత కొంతకాలంగా దుబాయ్ సర్కార్ పర్యాటకులన్నీ ఆకర్షించేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోంది. రంజాన్ మాసంలోనూ లిక్కర్ విక్రయాలకు అనుమతిచ్చింది. కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ లిక్కర్ హోం డెలివరీ పాలసీని తీసుకొచ్చింది. మద్యంపై అధిక ఆదాయం వస్తుండటంతో ఇలాంటి చర్యలను ప్రభుత్వం పకడ్బందీగా చేపడుతూ వస్తుంది.
అయితే జనవరి 1 నుంచి ఆల్కహాల్ పై ట్యాక్స్ ఫ్రీ ప్రకటించడంతో ప్రభుత్వం భారీగా ఆదాయం కోల్పోయే అవకాశం కన్పిస్తోంది. దుబాయ్ సమీప దేశాలై ఇరాన్.. కువైట్.. సౌదీ అరేబియాలో మద్యంపై నిషేధం ఉంది. ఇక దుబాయ్ మద్యంపై ట్యాక్స్ భారీగా ఉండటంతో దీనిని తగ్గించాలని మద్యంప్రియులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. పర్యాటకులు సైతం ఇదే కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మద్యంపై ట్యాక్స్ ను పూర్తిగా ఎత్తివేయడంతో అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పర్యాటకులు కేవలం దుబాయ్ లో షాపింగ్ లో వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ఆనందపడే వారు. తాజాగా మద్యం కూడా చౌకగా లభించనుండటంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.