రాజకీయ పార్టీలకు టాటా రూ.220 కోట్ల విరాళం

Update: 2019-04-14 07:42 GMT
రాజకీయ పార్టీలకు విరాళాలు అందరూ ఇస్తుంటారు. ఇందుకు ఐటీ కంపెనీలు ఏం మినహాయింపు ఏం కాదు. అయితే.. ఐటీ కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం కంటే బెదిరింపుల రూపంలో వసూలు చేయడమే ఎక్కువగా ఉంటుంది. కానీ దేశంలో ప్రతిష్టాత్మక సంస్థ టీసీఎస్‌ కూడా ఒక రాజకీయ పార్టీకి దాదాపు రూ.220 కోట్ల విరాళం ఇచ్చింది.

టాటా కన్సల్టెన్సీ సర్వీస్ జనవరి-మార్చి 2018-2019 ఆర్థిక సంవత్సరంలో నాలుగో క్వార్టర్ చివరిలో ఎన్నికల ట్రస్టుకు విరాళంగా అందించినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. టీసీఎస్ సహా  టాటా గ్రూపు కంపెనీలు గతంలో కూడా ఎన్నికల ట్రస్టుకు నిధులు సమకూర్చాయి. 2013లో టాటా ట్రస్టు ఏర్పాటు చేసిన ప్రొగ్రెసివ్‌ ఎలక్ట్రోల్ ట్రస్టుకు టీసీఎస్ నగదును విరాళంగా ఇచ్చింది. ఏప్రిల్ 1 - 2013 - మార్చి 31 - 2016 మధ్యకాలంలో పలు రాజకీయ పార్టీలకు ఈ ట్రస్టు నుంచే నిధులు సమకూరాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకే అత్యధికంగా నిధులు సమకూర్చగా.. బీజేడీ పార్టీ తర్వాతి స్థానంలో నిలిచింది. ఇదే కాలంలో టీసీఎస్ రూ.1.5 కోట్లు సహకారం అందించింది.

ఇక రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన కంపెనీల్లో భారతీ గ్రూపు - డీఎల్ ఎఫ్ కూడా ఉన్నాయి. 2017-18లో రూ. 144 కోట్లు బీజేపీకి విరాళంగా ఇచ్చింది. దేశంలో అనేక ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కార్పొరేట్లకు - రాజకీయ పార్టీలకు మధ్యవర్తులుగా ఉంటాయి. వీటిలో ప్రుటెండ్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ అతి పెద్దది. ఈ ట్రస్ట్‌ కు భారతీ గ్రూప్‌ - డీఎల్‌ ఎఫ్‌ భారీగా విరాళాలు ఇస్తుంటాయి. ఈ విరాళాల్లో ఎక్కువ మొత్తం భారతీయ జనతా పార్టీకే వెళ్లున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.   
Tags:    

Similar News