‘‘బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షం పక్కకు తప్పుకుంది. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ఆశించి.. బాద్యత మరచి అసెంబ్లీ గైర్హాజరు అవుతోంది. వారు లేకపోతే.. సభ ఎంత హుందాగా - అర్థవంతమైన చర్చలతో జరుగుతుందో మనం నిరూపించాలి. సింగపూర్ మోడల్ ప్రజాస్వామ్యాన్ని మనం తెలుగు ప్రజలకు రుచిచూపించాలి. ప్రతిపక్షం పాత్ర నామమాత్రమే అని.. ప్రజల సమస్యలను ప్రస్తావించడానికి ప్రభుత్వ పక్ష సభ్యులే సిద్ధంగా ఉంటారని మనం నిరూపించాలి...’’ ఇలాంటి అనేక రకాల సందేశాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు.. శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు సెలవిచ్చారు. ముఖ్యమంత్రి గారు చెబుతున్నది నిజమే ఏమో.. జనం సమస్యలను తెలుగుదేశం ఎమ్మెల్యలే సభలో డిస్కసింగు చేసేసి.. మన కష్టాలు తీర్చేస్తారేమో అని జనంలో ఎవరైనా భ్రమపడి ఉన్నా కూడా ఆశ్చర్యం ఎంతమాత్రమూ లేదు. కానీ.. శాసనసభలో చర్చలు ఎంత కామెడీగా జరుగుతున్నాయో... ప్రతిపక్షం ఒకటి ఉంటుందని, తమ ఆటలకు కళ్లెం వేస్తుంటుందనే అదుపు కూడా వారి మీద లేకపోవడంతో ఎంత నిర్లక్ష్యంగా ఆషామాషీగా అసెంబ్లీ ఎపిసోడ్ ను నడిపిస్తున్నారో అనడానికి ఇదే ఉదాహరణ.
సోమవారం నాడు శాసనసభలో కల్తీల మీద చర్చ జరిగింది. కల్తీలు అనేవి దాదాపుగా అన్నిరకాల ప్రజా వినియోగ వస్తువుల్లోకి చొరబడుతూ వారి జీవితాలతో ఎంతగా ఆటలాడుకుంటున్నాయో అందరికీ తెలుసు. ఇలాంటి సీరియస్ అంశం మీద చర్చ మాత్రం.. చాలా ఆషామాషీగా జోకులేసుకుంటున్నట్లుగా నడిచిపోయింది. అధికార పక్ష సభ్యులే ఏదో డ్రామా ఆడుతున్నట్లుగా ప్రతిపక్షం పాత్ర పోషిస్తే ఇలాగే ఉంటుందంటూ పలువురు వ్యాఖ్యానించుకోవడం కూడా కనిపించింది.
కల్తీలు ప్రజారోగ్యాన్ని సర్వనాశనం చేస్తున్నాయన్నది చాలా పెద్ద సబ్జెక్టు. ఇది కేవలం ఏపీని మాత్రమే కాకుండా, తెలంగాణను కూడా కుదిపేస్తున్న వ్యవహారం. అయితే ఈ కల్తీలను ఎక్కడికక్కడ మూలాల్లో గుర్తించి కట్టడి చేయడానికి ప్రభుత్వాల వద్ద నిర్దిష్ట ప్రణాళిక అంటూ ఏమీ లేనే లేదు. ఇలాంటి అంశం మీద చర్చ జరుగుతోంటే.. తెలుగుదేశం- భాజపా సభ్యులు పరస్పరం జోకులేసుకుంటున్న తరహాలో వ్యవహరించారు. కల్తీలకు సంబంధించిన ఈ ప్రశ్నలు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ను ఇరుకున పడేశాయి. ఆయన వెంటనే జవాబు చెప్పలేకపోయారు. ఇలాంటి సమయంలో.. భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జోక్యం చేసుకుని... తమ పార్టీకి చెందిన మంత్రిని సమర్థించుకున్నారు. తెదేపా నాయకులు అభ్యంతరం చెప్పబోతే.. మీరూ కల్తీ నేనూ కల్తీ అంటూ జోకులేశారు. మార్కెట్లో దొరికే వస్తువుల్లో విస్కీ కల్తీ, సోడా కూడా కల్తీ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సంబంధించిన సమస్యపై చర్చ జరిగేది ఇలాగేనా? ఇంత చవకబారు వ్యాఖ్యలతో సభలో చర్చ నడిపిస్తారా అంటూ జనం విస్తుపోతున్నారు.