గ్రేట‌ర్ ప్ర‌చారానికి ప‌వ‌న్!

Update: 2016-01-05 15:03 GMT
గ్రేట‌ర్ హైదార‌బాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక తేదీలు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. అధికార టీఆర్ ఎస్ పార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్-అభివృద్ధి మంత్రాన్ని జ‌పిస్తుండ‌టం, ఎంఐఎం ఓటు రాజ‌కీయం - కాంగ్రెస్ ప్ర‌తిప‌క్ష ఎజెండా - టీడీపీ-బీజేపీ కేంద్రం-అభివృద్ధి అండ అనే వ్యూహాల‌తో ముందుకువెళుతున్నాయి. అయితే పార్టీల‌ వ్యూహాల ద‌శ‌లోనే ఇపుడు ప్ర‌చారం అంశం కూడా తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆయా పార్టీల‌కు ప్ర‌త్యేకంగా ప్ర‌చార తురుపుముక్క‌లు లేన‌ప్ప‌టికీ ఎన్డీఏ కూట‌మి మాత్రం ప‌క్కా భ‌రోసాతో ఉంది.

బీజేపీ-టీడీపీల ప‌క్షాన గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌చారం నిర్వ‌హించిన జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో కూడా ప్ర‌చారం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు కూట‌మి త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని ఎన్డీఏ నేత‌లు ప్రాథ‌మికంగా నిర్ణ‌యించార‌ని తెలుస్తోంది. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ షూటింగ్‌ లో బిజీబిజీగా ఉన్న ప‌వ‌న్‌ కు ఆహ్వానం కూడా అందించిన‌ట్లు స‌మాచారం. అయితే ప‌వ‌న్ ఇంత‌వ‌ర‌కు తాను ప్ర‌చారానికి వ‌చ్చేది రానిది ఖ‌రారు చేయ‌లేదట‌.

పవ‌న్ ఇప్ప‌టికిప్పుడు ప్ర‌చారానికి రావ‌డంపై క్లారిటీ ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఎన్డీఏ నేత‌లు ఇబ్బందిప‌డ‌టం లేదట‌. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే వ‌ర‌కు ప‌వ‌ర్ స్టార్ ప్ర‌చారానికి వ‌స్తారంటూ ఆయా పార్టీల నేత‌లు ధీమాగా ప్ర‌క‌టించేస్తున్నారు.
Tags:    

Similar News