తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు వర్గ పోరు కొన్ని జిల్లాల్లో గట్టిగా మరి కొన్ని చోట్ల ఒక మాదిరిగా ఉంటూ వచ్చింది. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి వర్గ పోరు కూడా ప్రధాన కారణం అని చెబుతారు. ఇదిలా ఉంటే విపక్షంలోకి పార్టీ వచ్చినా కూడా ఈ గ్రూపుల గోల అయితే పోలేదు అని అంటున్నారు.
లేటెస్ట్ గా చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు బిగ్ సౌండ్ చేశారు. ఈసారి ఆయన వైసీపీ మీద విరుచుకుపడలేదు. షరామామూలుగా అధికార పార్టీని టార్గెట్ చేయలేదు. ఆయన సొంత పార్టీ పోకడల మీదనే హాట్ హాట్ కామెంట్స్ చేశారు. దాంతో షాక్ తినడం టీడీపీ పెద్దల వంతు అవుతోంది.
ఇంతకీ అయ్యన్నపాత్రుడు ఏమన్నారు అంటే టీడీపీలో కొన్ని బురద పాములు ఉన్నాయట. అవి గత మూడేళ్ళూ పుట్టలో నుంచి అసలు బయటకు రానే లేదట. పార్టీ ఒక వైపు కష్టాలలో ఉంటే, క్యాడర్ అన్ని రకాలుగా నష్టపోతుంటే ఆ బురద పాములు తమకేమీ సంబంధం లేనట్లుగా అలా ఉన్నాయట.
ఏపీలో అధికార పార్టీ టీడీపీ కార్యకర్తలను వేధించి సాధించిందని, ఏకంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడులు చేసిందని అయినా కూడా కొన్ని బురద పాములు పట్టనట్లుగా ఉన్నాయని అయ్యన్న అంటున్నారు. ఇపుడు ఆ బురద పాములు మళ్ళీ యాక్టివ్ అయ్యాయన్నది అయ్యన్న అభియోగం.
అంతే కాదు చంద్రబాబు పక్కన కొందరు నేతలు కూర్చుని ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని, ఇది ఏ రకమైన సంకేతాన్ని క్యాండర్ కి ఇస్తుందని అయ్యన్న ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం గత మూడేళ్ళుగా కష్టపడిన వారు, పార్టీని కాపాడుకోవడానికి తమ సర్వస్వం ధారపోసిన వారు ఒక వైపు ఉంటే మధ్యలో మళ్లీ యాక్టివ్ అయిన వారిని పక్కన పెట్టుకోవడం మంచిది కాదని ఆయన అంటున్నారు.
మొత్తానికి అటు అధినాయకత్వానికి కూడా సలహాలు ఇస్తున్న తీరున అయ్యన్న గట్టి వ్యాఖ్యలే చేస్తున్నారు. అదే విధంగా బురద పాములు అని ఆయన ఎవరిని ఉద్దేశించి కామెంట్స్ చేశారో కూడా సొంత పార్టీలో చర్చ సాగుతోంది. ఒక మాజీ మంత్రికి అయ్యన్నకు చాలా ఏళ్ళుగా రాజకీయంగా వర్గ పోరు సాగుతూ వస్తోంది. అధికారంలో ఉన్నపుడు కూడా ఈ ఇద్దరినీ బాబు కూర్చోబెట్టి మాట్లాడినా కలిపి అయితే ఉంచలేకపోయారని చెబుతారు.
బహుశా ఆ మాజీ మంత్రి మీదనే ఇపుడు అయ్యన్న మళ్ళీ కామెంట్స్ చేసి ఉంటారని అంటున్నారు. ఆయన కూడా ఈ మధ్య యాక్టివ్ అవుతున్నారు. మళ్లీ టీడీపీ ఆఫీస్ గడప తొక్కుతున్నారు. టీడీపీ గురించి బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మొత్తానికి చూస్త ఆయనే అయ్యన్న టార్గెట్ అని అంటున్నారు. ఇవన్నీ సరే కానీ పార్టీ ఇపుడు విపక్షంలో ఉంది. అందరి సహకారం కావాలి. ఇపుడు పార్టీలో వర్గ పోరుని తెర మీదకు తెస్తే దాని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని క్యాడర్ అంటోంది.
ఇక చంద్రబాబుకు పార్టీలో ఎవరేంటి అన్నది బాగా తెలుసు అని కూడా అంటున్నారు. మొత్తానికి టీడీపీ అధికారంలోకి వస్తుంది అన్న అంచనాలతోనే కొంతమంది నేతలు మళ్లీ యాక్టివ్ అవుతున్నారని, దాని వల్ల అసలైన వారికి అన్యాయం జరుగుతోందన్నదే అయ్యన్న ఆవేదన అని ఆయన సన్నిహితులు అంటున్నారు చూడాలి మరి బాబు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో.