నారాయణ ఖేడ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలు షాకులతో కిందామీదా పడుతున్న ఆ పార్టీకి నారాయణ ఖేడ్ ఎన్నికలో వచ్చిన ఓట్లు తీవ్ర నిరాశకు గురి చేసేలా ఉన్నాయి. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఒకే ఒక్క డివిజన్ లో విజయం సాధించిన టీడీపీ.. నారాయణఖేడ్ లో ఏకంగా డిపాజిట్ కూడా గల్లంతు కావటం గమనార్హం.
ఈ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థికి 50వేల మెజార్టీ పక్కా అని ఎన్నికల ప్రచారం మొదటి నుంచి మంత్రి హరీశ్ రావు చెప్పటం తెలిసిందే. దీనికి తగ్గట్లే టీఆర్ ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డికి 93,076 ఓట్లతో 53వేల మెజార్టీని సొంతం చేసుకోగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవరెడ్డికి 39,451 ఓట్లు వచ్చాయి. ఇక.. టీటీడీపీ అభ్యర్థి విజయపాల్ రెడ్డికి కేవలం 14,787 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో.. ఆయన తన ధరావత్తును కోల్పోయారు.