టీడీపీ అధినేత చంద్రబాబు అపర రాజకీయ చాణక్యుడు. ఆ సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఓడినా బెదరరు, తొణకరు, వణకరు. మళ్లీ గెలుపు కోసం అలా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆయనకు వయసుతో సంబంధం లేదు, ఏడున్నర పదుల ఏజ్ లో కూడా పాతికేళ్ళ కుర్రాడి మాదిరిగా జగన్ మీద సై అంటారు. ఎవరెన్ని అనుకున్నా వ్యూహాలతో బాబు ప్రత్యర్ధులను బేజారెత్తిస్తారు.
అలాంటి బాబు మదిలో లేటెస్ట్ గా ఒక ఆలోచన మెదిలిందిట. అది పక్కా వ్యూహం కూడాను. చంద్రబాబు ఈసారి ఎక్కువగా ఉత్తరాంధ్రా మీద ఫోకస్ పెడుతున్నారు. పోయిన చోటనే వెతుక్కోవాలన్న నీతిని అమలు చేస్తున్నారు. ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్న ఉత్తరాంధ్రాలో మెజారిటీ సీట్లను కొల్లగొడితే ఈసారి సీఎం తానే అని బాబు లెక్కలు వేసుకుంటున్నారు.
దాంతో బాబు మార్క్ పాలిటిక్స్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. జగన్ ఉత్తరాంధ్రా మీద దృష్టి పెట్టి ఉంచారు. విశాఖను రాజధాని అని వైసీపీ నేతలు ఒకటికి పదిసార్లు కలవరిస్తున్నది అందుకే. విశాఖకు రాజధాని రాకపోయినా ఆ మబ్బుల్లో ఉంచి రాజకీయంగా భారీ లబ్ది పొందాలని వైసీపీ మార్క్ రాజకీయ వ్యూహం.
దాంతో దానికి విరుగుడుగా చంద్రబాబు కూడా గట్టి ప్లాన్ వేశారు. తానే విశాఖ నుంచి బరిలోకి దిగి పోటీ చేస్తే మొత్తానికి మొత్తం ఉత్తరాంధ్రా టీడీపీ వైపుగా టర్న్ అవుతుంది అని బాబు గారి బ్రహ్మాండమైన ఆలోచనట. విశాఖ సిటీ టీడీపీకి కంచుకోట. ఎంతలా అంటే 2019 ఎన్నికల్లో ఏపీ అంతటా వైసీపీ గాలి వీచినా జగన్ వేవ్ కనిపించినా విశాఖలో మాత్రం నాలుగు సీట్లూ టీడీపీ ఖాతాలో చేరాయి. దాంతో ఈసారి చంద్రబాబే నేరుగా పోటీ చేస్తే విశాఖ సిటీయే కాదు, మొత్తం ఉమ్మడి జిల్లా కూడా సైకిలెక్కేస్తుంది అని భావిస్తున్నారు.
అదే విధంగా పొరుగున ఉన్న గోదావరి జిల్లాలూ కూడా ప్రభావితం అవుతాయని బాబు కొత్త అంచనాలు వేసుకుంటున్నారని టాక్. చంద్రబాబు విశాఖ నుంచి పోటీ చేస్తారు అన్న ప్రచారం అయితే ఇపుడు గట్టిగా టీడీపీలో వినిపిస్తోంది. అయితే కుప్పం సీటుని ఆయన విడిచిపెట్టరు అని అంటున్నారు.
రెండు చోట్లా ఆయన గెలిచి సత్తా చాటుతారని, ఆ మీదట అధికారంలోకి వస్తే ఏదో ఒక సీటుని వదులుకుని రెండవ దానిని స్థిరపరచుకుంటారు అని చెబుతున్నారు. 1994 ఎన్నికల్లో ఎన్టీయార్ ఉత్తరాంధ్రా జిల్లాలలో పోటీ చేసి గెలిచారు. నాడు ఆయన టెక్కలి నుంచి విజయశంఖారావం పూరించారు. ఇపుడు చంద్రబాబు కూడా అచ్చం మామగారి బాటన నడుస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.