చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్‌.. బ్రేకులేసిన‌ వైసీపీ.... !

Update: 2021-12-10 15:30 GMT
రాజ‌కీయాల్లో ఎత్తులు పై ఎత్తులు మామూలే. ఒక‌రిపై ఒక‌రు పై చేయి సాధించేందుకు అధికార ప్ర‌తిప‌క్షాలు స‌హ‌జంగానే దూకుడు ప్ర‌ద‌ర్శిస్తాయి. ఇలానేఏపీలోనూ అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య ఎత్తులు పై ఎత్తులు సాగుతున్నాయి.

గడిచిన రెండున్న‌రేళ్లుగా టీడీపీని ఎంత‌గా పుంజుకునేలా చేయాల‌ని అన్నా.. ఎక్క‌డో విఫ‌లం అవుతూనే ఉన్నారు. దీంతో పార్టీ అధినేత చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాలు మారుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల అసెంబ్లీలో జ‌రిగిన ర‌గ‌డ‌ను.. ఆయ‌న రాజ‌కీయంగా వాడుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

అంటే.. చంద్ర‌బాబు త‌న కుటుంబ స‌భ్యుల‌ను స‌భ‌లోనే దూషించారంటూ.. మీడియా ముందుకు వ‌చ్చి క‌న్నీరు కూడా పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో నంద‌మూరి కుటుంబం కూడా రియాక్ట్ అయింది.

దీనిని అక్క‌డితో వ‌దిలేయ‌కుండా.. చంద్ర‌బాబు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. దీనిలో భాగంగానే మ‌హిళ‌ల‌ను వైసీపీ తీవ్రంగా అవ‌మానిస్తోందంటూ.. ఆయ‌న గౌర‌వ స‌భ‌ల‌కు ప్లాన్ చేశారు.

ప్ర‌తి గ్రామంలోనూ.. నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఈ స‌భ‌లు నిర్వ‌హించి.. అసెంబ్లీలో త‌న‌కు , త‌న కుటుంబానికి జ‌రిగిన అవ‌మానాన్ని వివ‌రించాల‌ని నిర్ణ‌యించారు.

ఇక‌, చంద్ర‌బాబు ఆదేశాలు అందుకున్న నాయ‌కులు వెంట‌నే రంగం లోకి దిగి.. త‌మ వంతుగా స‌భ‌లు కూడా మొద‌లు పెట్టారు. అంతేకాదు.. నియోజ‌క‌వ‌ర్గం స్థాయిలో స‌భ‌లు పెట్టి.. భారీ బ‌హిరంగ స‌భ‌ల్లో చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తే.. అస‌లు ఏం జ‌రిగిందో వివ‌రిస్తే.. బాగుంటుంద‌నే సూచ‌న‌లు కూడా వ‌చ్చాయి.

దీంతో చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. దీని ప్ర‌కారం బ‌హిరంగ స‌భ‌లు పెట్టి.. వైసీపీని బ‌ద్నాం చేయాల‌ని అనుకున్నారు.కానీ, అనూహ్యంగా వైసీపీ ఎంట్రీ ఇచ్చింది. బాబు ప్లాన్‌కు బ్రేకులు వేసింది. `స‌భ‌లో ఎవ‌రూ భువ‌నేశ్వ‌రిని అవ‌మానించ‌లేద‌`ని .. వైసీపీ కీల‌క నేత‌లు ప్ర‌క‌ట‌న‌లు చేశారు.

అంతే కాదు.. మ‌రో నాయ‌కుడు.. భువ‌నేశ్వ‌రి కాళ్ల‌ను క‌న్నీటితో కడుగుతామ‌న్నారు. దీంతో చంద్ర‌బాబు ప్లాన్ రివ‌ర్స్ అయింది. ఇంత‌గా.. వైసీపీ నాయ‌కులు చెప్పిన త‌ర్వాత కూడా త‌ను అదే విష‌యాన్ని ప‌ట్టుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లినా.. మైలేజీ ఉండ‌ద‌ని.. ప‌నిగ‌ట్టుకుని తానే ప్ర‌చారం చేసుకున్న‌ట్టు అవుతుంద‌ని.. త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

అంతేకాదు.. ఇప్పుడు గౌర‌వ స‌భ‌ల‌ను కూడా నిలిపి వేయాల‌ని ఆదేశాలు వెళ్లాయి. మొత్తానికి చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్‌కు.. వైసీపీ వ్యూహాత్మ‌కంగా.. అడ్డుక‌ట్ట వేసింద‌నే చ‌ర్చ సాగుతోంది.


Tags:    

Similar News