వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని.. చంద్రబాబు తపిస్తున్నారు. అంతేకాదు.. ఎప్పుడైనా సరే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలోనూ బుధవారం నుంచి ఆయన జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబు వ్యూహం సరైందే కానీ.. ఆయన ఒక్కరి వల్ల.. ఎన్నాళ్లు నెట్టుకువస్తారు? అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తున్న అంశం. ఎందుకంటే.. పార్టీ పరిస్థితి దూరంగా ఉన్నంత నునుపు.. దగ్గరగా మాత్రం లేదు.
ప్రస్తుత పరిణామాలను గమనిస్తే.. `అయితే.. బాబు.. లేకపోతే.. లోకేష్`. ఈ ఇద్దరు తప్ప.. మిగిలిన వారు లేరా? అనే సందేహాలు వస్తున్నాయి. నిజానికి పార్టీ తరఫున వాయిస్ వినిపించేందుకు గతంలో పనిచేసిన వారు ఇప్పుడు కనిపించడం లేదు. పోనీ.. నియోజకవర్గాల్లో అయినా.. బరులు గీసుకుని.. ప్రాధాన్యం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. దీంతో ఎక్కడికక్కడ `బాబు రావాలి.. భవిష్యత్తు మార్చాలి` అనే టాక్ వినిపిస్తోంది.
మరో రెండేళ్లలోనే ఎన్నికలు ఉన్నాయి. నిజానికి చివరి ఆరు మాసాలు కూడా ఎన్నికల హడావుడి పెరిగే అవకాశం ఉంది. అంటే..కేవలం ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది.
ప్రజలకు దూరమైన నాయకు లను వారికి చేరువ చేయాలన్నా.. తమకు దూరమన వర్గాలను దరిచేర్చుకోవాలన్నా.. ఇదే సమయం కీలకం. ఇలాంటి సమయంలో అందరికీ దిశానిర్దేశం చేస్తూ.. వారిని కూడా నడిపించాల్సిన అవసరం ఉందని.. విశ్లేషకులు చంద్రబాబు విషయంలో చేస్తున్న ప్రధాన సూచన.
లేకపోతే.. కేవలం `చంద్రబాబు` వల్ల నేతలు పుంజుకోకపోతే.. రేపు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో పార్టీ నేతలు.. వ్యవహరిస్తున్న తీరు.. ఇబ్బందిగా ఉందనేది అధిష్టానానికి సైతం అందింన నివేదక స్పష్టం చేస్తోంది.
ఇలాంటి సందర్భంలో.. పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించా ల్సిన వారు.. ప్రస్తుతం ఊసు లేకుండా.. వ్యవహరిస్తున్న సమయంలో చంద్రబాబు యాత్రలు.. ఫలించాలంటే.. అందరినీ కదిలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. లేకపోతే.. ఈయాత్రలు విహార యాత్రలుగానే మిగిలిపోతాయని విశ్లేషకులు చెబుతున్నారు.