ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. మూడుసార్లు ముఖ్యమంత్రి.. పద్నాలుగున్నరేళ్లకు పైగా .. పాలన అందించిన నా యకుడు.. కేంద్రంలో చక్రాలు తిప్పిన నాయకుడు.. ఇలా చెప్పుకొంటూ.. పోతే.. టీడీపీ అధినేత చంద్రబా బుకు అనేక పర్యాయపదాలు.. బిరుదులు ఉన్నాయి. అయితే.. ఆయన రాజకీయ జీవితం మొత్తం ఒక ఎత్త యితే.. ఇప్పుడు జరుగుతున్న జీవితం.. మరో ఎత్తు...! ఇన్నేళ్లలో తాను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని.. బాబు పదే పదే చెబుతుంటారు. జగన్ ఎత్తులు తన దగ్గర పారవని అంటూ ఉంటారు. కానీ.. గత రెండున్నరేళ్లుగా చంద్రబాబు పరిస్థితిని గమనిస్తే.. ఎన్ని మెట్లు దిగిపోతున్నారో.. స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాతకి.. 2019లో అధికారం వదులుకున్న నాటికి పరిస్థితిలో తేడా చాాలా స్పష్టంగా కనిపిస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత.. అడుగడుగునా చంద్రబాబు ఆత్మరక్షణలో పడుతున్నారు. తన జీవితంలో ఏనాడూ.. శాసన మండలిలో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్నది లేదు. తన జీవితంలో ఏనాడూ.. నల్లచొక్కా ధరించి.. అసెంబ్లీకి వచ్చింది లేదు. తన జీవితంలో ఏనాడూ.. రోడ్డు ఎక్కి, నిరసన తెలిపింది లేదు. కానీ.. ఇప్పుడు అడుగులు తడబడుతున్నాయి. మెట్లు జారిపోతున్నాయి. జగన్ ధాటికి.. చంద్రబాబు.. గుండెలు అదిరిపోతున్నాయి. ఇది నిజం. ఈ మాట టీడీపీలోనే వినిపిస్తుండడం మరింత విస్మయానికి గురిచేస్తోంది.
చంద్రబాబు జీవితంలో అంటే.. తానే చెప్పుకొన్నట్టు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 36 గంటల దీక్ష ఎప్పుడైనా చేశారా? ఏనాడైనా.. కేంద్రానికి ఫిర్యాదులు చేసుకునే పరిస్థితి, పార్టీని ఇంతలా కాపాడుకునే పరిస్థితి వస్తుందని భావించారా? అంటే.. లేనేలేదు. చివరకు బాబు వస్తున్నారంటే ఢిల్లీలో రెడ్ కార్పెట్ వేసే పరిస్థితి నుంచి ఆయనకు అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఒక్కరోజు కూడా ఇలా జరుగుతుంది ? అని అనుకోలేదు. కానీ.. తాను చేసుకున్నదే ఇప్పుడు అనుభవిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
నందమూరి కుటుంబ అభిమానులు కూడా ఇప్పుడు బాబును పట్టించుకోవడం లేదు. పార్టీలో సీనియర్లుగా ఉన్న 30 ఏళ్ల నాయకులు మాత్రమే చంద్రబాబు చుట్టూ చేరారు తప్ప.. మంత్రి పదవులు అనుభవించిన యువ నేతలు ఒక్కరూ ముదుకు రాలేదు. పోనీ.. తానే చెబుతున్నట్టు బీసీలే తన పార్టీకి వెన్నెముక అంటున్న చంద్రబాబుకు బీసీలు ఇప్పుడు ఏమయ్యారు? ఏ ఒక్కరైనా గళం విప్పారా? ఎవరైనా అండగా ఉన్నారా? అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరిస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు. కేవలం కుమారుడిని సీఎం చేసుకునేందుకు చంద్రబాబు ఇంతలా ప్రయాసపడుతున్నారనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్న దరిమిలా.. ఆయనపై ఉన్న సానుభూతి కూడా కొట్టుకుపోతోంది.
లేకపోతే.. ఈ వయసులో సుగర్, బీపీ వృద్ధాప్య సమస్యలున్న నాయకుడు 36 గంటల దీక్షకు కూర్చుంటే.. రాష్ట్రం మొత్తం కదిలిపోవాలి. కానీ.. అలా జరిగిందా ? బంద్‌కు పిలుపు ఇస్తే.. ఎవరైనా స్వచ్ఛందంగాముందుకు వచ్చారా? రాజధాని అమరావతిలోనూ చంద్రబాబుకు మద్దతుగా ఎవరైనా నిలబడ్డారా?; సో.. చంద్రబాబు పుస్తకంగా ఈ రెండున్నరేళ్లు.. ఒక పేజీ కాదు.. ఒక అధ్యాయంగా మిగిలిపోయింది.