అందరూ టీడీపీ అధినేత చంద్రబాబును అధికారంలోకి రావాలని కోరుకునేవారే. ఎక్కడికక్కడ ఆయన గత పాలనను తలుచుకుని.. ముక్కుచీదుకునేవాళ్లే! ఆయనను నవ్యాంధ్ర పితామహుడిగా.. తీర్చి దిద్దా లని కూడా అనుకున్నారు. ఆయన పాలనలో తెలుగు రాష్ట్రం దేశంలో వెలుగు రాష్ట్రం కావాలని ఆకాంక్షిం చారు. అంతేకాదు.. గత ఐదేళ్ల పాలన.. దేశంలోనే నెంబర్ 1 అంటూ.. తీర్పులు కూడా చెప్పారు. మెచ్చుకోలు మాటలు మాట్లాడారు.
చంద్రబాబు పాలనను ఆకాశానికి ఎత్తేశారు. అయితే.. అనూహ్య కారణం కావొచ్చు.. ప్రజల ఆలోచనా విధా నం మారి ఉండొచ్చు.. లేదా.. అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చెప్పినట్టు.. క్షేత్రస్థాయిలో పరి స్థితులు ఇబ్బందిగా మారి ఉండొచ్చు.
ఏదేమైనా.. బాబు ఓడిపోయారు. మూడేళ్లు దాటిపోయింది. ఇంత మంది శ్రేయోభిలాషులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావాలని.. వీరంతా కూడా కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ఆయన అధికారంలోకి వస్తేనే.. బాగుంటుందని కూడా చెబుతున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. ఎవరూ కూడా పట్టుమని ఒక మంచి సలహా ఇస్తున్న పాపాన పోవడం లేదు. అంతేకాదు.. ఎవరూ కూడా.. గత ఎన్నికలకు ముందు టీడీపీ చేసిన లోపాలు.. కానీ.. జరిగిన పొరపాట్లు కనీ లేవనెత్తడం లేదు. పార్టీ పుంజుకునేలా.. వ్యూహాలు అందించే సామర్థ్యం కూడా కరువైంది. ఎందుకు ఇలా జరుగుతోంది? అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చకు వస్తున్న అంశం.
చంద్రబాబు విజయాన్ని కోరుకునేవారు.. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎలా ముందుకు సాగాలనే విషయంపై ఒక్క మాటంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. అంతేకాదు.. ఎంతసేపూ.. వైసీపీని తిట్టిపోయడం.. లేదా.. సీఎం జగన్ చేతగాని వాడంటూ.. ఎద్దేవా చేసే కథనాలతో ముందుకు సాగడం వల్ల.. చంద్రబాబుకు వచ్చే మైలేజీ ఏమీ లేకపోగా.. జగన్‌కు మాత్రం ఇమేజీ పెరుగుతోంది.
ఇక, చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకుని..తనపై రాళ్లు విసురుతున్న వారికి.. అసెంబ్లీలోనే జగన్ సమాధానం చెబుతున్నారు. తద్వారా.. ప్రజల్లోకి పాజిటివ్ వేవ్ వెళ్తోంది. సో.. ఏతా వాతా ఎలా చూసుకున్నా.. మన అనుకున్న వారు.. చేస్తున్న పొగడ్తల రాజకీయం వల్ల.. చంద్రబాబుకు .. మేలు చేయకపోగా.. కీడు ఎక్కువగా చేస్తోందని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.