ఏపీ టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఏపీ ప్రభుత్వం మధ్య వార్ ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతిని విమర్శిస్తూ భారతి పే అంటూ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారని ఇటీవల సీఐడీ ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లో ఉంటున్న చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లారు. అయితే ఆ సమయంలో చింతకాయల విజయ్ ఇంట్లో లేరు. దీంతో ఆయన పిల్లలను విజయ్ గురించి అడిగి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసి సీఐడీ అధికారులు వెనుదిరిగారు.
ఈ వ్యవహారంపై టీడీపీ మండిపడ్డ సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేవారిపై జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని, తప్పుడు కేసులు వేధిస్తోందని నిప్పులు చెరిగింది. చింతకాయల విజయ్ ఇంటిలోకి ఏపీ సీఐడీ అధికారులు అక్రమంగా ప్రవేశించారని టీడీపీ ఆరోపించింది. అంతేకాకుండా చిన్న పిల్లలతో మీ నాన్న ఎక్కడ అంటూ రూడ్ గా ప్రవర్తించారని తీవ్ర విమర్శలు చేసింది.
ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ వచ్చి చింతకాయల్ విజయ్ కుటుంబ సభ్యులను, ముఖ్యంగా చిన్న పిల్లలను భయభ్రాంతులకు గురిచేయడంపై తెలంగాణ పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు. అయితే జూబ్లీహిల్స్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు. దీంతో టీడీపీ నేతలు అక్కడే ధర్నాకు దిగి నిరసన వ్యక్తం చేశారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ టీడీపీ నేతల్ని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.
ఏపీ సీఐడీ హైదరాబాద్లో చింతకాయల విజయ్ నివాసంలో వ్యవహరించిన తీరుపై తమ ఫిర్యాదును తెలంగాణ పోలీసులు తీసుకోకపోవడంతో టీడీపీ నేతలు తాజాగా అక్కడి బాలల హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. ఈ మేరకు నలుగురు ఏపీ సీఐడీ పోలీసులపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
అక్టోబర్ 1న ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లోని చింతకాయల విజయ్ నివాసానికి వచ్చి ఆయన ఫ్లాట్‌లోకి బలవంతంగా ప్రవేశించారని వర్ల రామయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా విజయ్ 5 ఏళ్ల కుమార్తెను మీ నాన్న ఎక్కడని పదే పదే ప్రశ్నించి, భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. అంతేకాకుండా తీవ్ర మానసిక వేధింపులకు గురి చేశారని పేర్కొన్నారు.
ఐదేళ్లు, రెండేళ్లు వయస్సున్న పిల్లల ఫోటోలను సీఐడీ పోలీసులు తీసుకెళ్లారని తెలిపారు. ఏపీ సీఐడీ పోలీసుల ప్రశ్నలతో చిన్నారులు భయాందోళనలకు, మానసిక వేదనకు గురయ్యారని ఫిర్యాదులో వివరించారు. ఈ నేపథ్యంలో పిల్లలతో అనుచితంగా ప్రవర్తించిన ఏపీ సీఐడీ పోలీసులుగా చెబుతున్న నలుగురిపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య విన్నవించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.