ముంద‌స్తులో మ‌రో సంచ‌ల‌నం..మ‌హాకూట‌మితో కేసీఆర్‌ కు భారీ షాక్‌

Update: 2018-09-08 07:23 GMT
చివ‌ర‌కు ఎలాంటి ఫ‌లితాలు వెలువ‌డ‌తాయో కానీ.. ఆరంభ‌మే అదిరిపోయే సంచ‌ల‌నాలకు నెలువుగా మారింది తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల వ్య‌వ‌హారం. త‌న ప‌ద‌వీ కాలం పూర్తి కాక‌ముందే ముంద‌స్తుకు వెళ్లేందుకు డిసైడ్ అయిన కేసీఆర్ నిర్ణ‌యం ఒక సంచ‌ల‌న‌మైతే.. అసెంబ్లీని ర‌ద్దు చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే 105 మంది అభ్య‌ర్థుల‌తో జాబితాను ప్ర‌క‌టించి మ‌రో సంచ‌ల‌నానికి తెర తీశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ లాంటి కొండ‌ను ఢీ కొట్ట‌టానికి తెలంగాణ‌లోని విప‌క్షాల‌న్నీ (బీజేపీ.. మ‌జ్లిస్ మిన‌హాయించి) ఏకం కావాల‌ని.. మ‌హా కూట‌మిగా అవ‌త‌రించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ అందిన విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. 36 ఏళ్ల టీడీపీ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ లేని రీతిలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

అనివార్య ప‌రిస్థితుల్లో ఒంట‌రిగా పోటీ చేసి ఓడే క‌న్నా.. కేసీఆర్ ను ఓడించ‌ట‌మే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ప్ర‌తిప‌క్షాలు పావులు క‌దుపుతున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ తో జ‌త క‌ట్టేందుకు వీలుగా టీడీపీ.. కోదండం మాష్టారి పార్టీ.. రెండు క‌మ్యూనిస్ట్ పార్టీలు క‌లిసి ఒక కూట‌మిగా ఏర్ప‌డే వీలుంద‌ని చెబుతున్నారు.

మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్ 90 స్థానాల్లోపోటీ చేయాల‌ని భావిస్తుండ‌గా.. మిత్ర‌పక్షాల‌కు 29 సీట్ల‌ను కేటాయించ‌నున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ అందిన స‌మాచారం ప్ర‌కారం టీడీపీ మొత్తం 20 సీట్లు కోరుతుంటే.. కాంగ్రెస్ 15 సీట్లు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. మిగిలిన 14 సీట్ల‌ను మూడు పార్టీల‌కు ఇవ్వ‌నునాన‌రు. కోదండం మాష్టారి పార్టీకి ఐదు నుంచి తొమ్మిది సీట్లు కేటాయించే వీలున్న‌ట్లుగా తెలుస్తోంది.

కేసీఆర్ ఓట‌మే లక్ష్యంగా విప‌క్షాలు జ‌ట్టు క‌ట్టాల‌ని భావిస్తున్న‌ట్లుగా స‌మాచారం. వాస్త‌వానికి కాంగ్రెస్‌.. తెలుగుదేశం పార్టీల మ‌ధ్య‌పొత్తు ఎప్పుడో జ‌రిగిపోయింద‌ని చెబుతున్నారు. ప్రాధ‌మికంగా రెండు పార్టీలు క‌లిసి పోటీ చేయాల‌ని ఆలోచ‌న గ‌తంలోనే చేసింద‌ని.. ఇప్పుడు ఎవ‌రికెన్ని సీట్లు అన్న దానిపై చ‌ర్చ జ‌రుగుతోంద‌న్న మాట‌ను చెబుతున్నారు. సీట్ల కేటాయింపు విష‌యంలో మ‌రీ ప‌ట్టుద‌ల‌గా ఉండ‌కూడ‌ద‌ని.. కూట‌మి ప్ర‌యోజ‌నాలు త‌ప్పించి.. పార్టీ ప్ర‌యోజ‌నాల‌కు అస్స‌లు తావివ్వ‌కూడ‌ద‌ని.. మొత్తంగా కేసీఆర్ కు చెక్ పెట్ట‌ట‌మే ల‌క్ష్య‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఇక‌.. టీడీపీకి కేటాయించే స్థానాల్లో దాదాపు ప‌ది వ‌ర‌కూ హైద‌రాబాద్‌..రంగారెడ్డి.. మేడ్చ‌ల్ జిల్లాల్లోని నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉంటాయ‌ని తెలుస్తోంది. త‌మ‌కున్న బ‌లం హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర‌మేన‌ని ఆ త‌ర్వాత ఖ‌మ్మం.. వ‌రంగ‌ల్ తో పాటు నిజామాబాద్ గా చెబుతున్నారు. మొత్తంగా ఐదారు జిల్లాల్లోనే టీడీపీ అభ్య‌ర్థులు ఉంటార‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా పుట్టిన టీడీపీ.. 36 ఏళ్ల త‌ర్వాత అదే పార్టీతో పొత్తు లెక్క‌లు మాట్లాడుకోవ‌టం ఇప్పుడు రాజ‌కీయ సంచ‌ల‌నంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News